Nandamuri Heroes: వరుస విజయాలతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. నందమూరి ఫ్యామిలీ హీరోల నుంచి ఏదైనా సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తే ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఆ ప్రకటన కోసం ఎదురుచూస్తారు. నందమూరి హీరోలలో బాలయ్య ప్రస్తుతం మాస్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కళ్యాణ్ రామ్ నటుడిగా, నిర్మాతగా రెండు పడవలపై ప్రయాణం చేయడంతో పాటు బింబిసార సినిమాతో నటుడిగా,

నిర్మాతగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే నందమూరి హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి హిట్ గా నిలవడంతో పాటు నిర్మాతలకు ఊహించని రేంజ్ లో లాభాలను అందిస్తున్నాయి. నందమూరి హీరోల కృషి, టాలెంట్ కు లక్ కూడా తోడైంది. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లో ఉన్నారు. ఈ హీరోల గత సినిమాలు సైతం భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ఈ హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా భిన్నమైన కథలతో తెరకెక్కుతుండటంతో పాటు కచ్చితంగా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నందమూరి హీరోల వరుస విజయాలతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. అయితే నందమూరి హీరోల మల్టీస్టారర్ దిశగా అడుగులు పడితే బాగుంటుంది. మనం తరహా కాన్సెప్ట్ మూవీలో బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్ లను చూడాలని ఫ్యాన్స్ కోరిక కాగా అభిమానుల కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాలి.

అన్ స్టాపబుల్ షోకు కళ్యాణ్ రామ్, తారక్ కలిసి హాజరైతే చూడాలని ఉందని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరైనా ప్రయత్నిస్తే ఈ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus