తన తండ్రి నాగార్జునలానే అఖిల్ కూడా టాలీవుడ్ హీరోలందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంటాడు. నాగార్జున తన తోటి హీరోలైన చిరంజీవి,వెంకటేష్ లతో ఎంతో సన్నిహితంగా ఉంటాడు. వెంకటేష్ బావమరిది అయినప్పటికీ.. చిరంజీవిని మాత్రం సొంత అన్నయ్యగా భావిస్తూ ఉంటాడు. అచ్చం అలాగే అతని చిన్న కొడుకు అఖిల్ కూడా రాంచరణ్ మరియు ఎన్టీఆర్,నితిన్ లతో చాలా సన్నిహితంగా ఉంటాడు. రాంచరణ్ ను పెద్దన్న అంటుంటాడు. గతంలో ‘హలో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చి తన వంతు ప్రమోషన్స్ చేసాడు రాంచరణ్.
ప్రస్తుతం అఖిల్- సురేందర్ రెడ్డి ల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఏజెంట్’ ప్రాజెక్టుని సెట్ చేసింది కూడా చరణే అని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్, అఖిల్ కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని షేర్ చేసింది మన వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ వీడియోలో ఎన్టీఆర్ సరదాగా అఖిల్ ను ఆటపట్టిస్తూ అతని తొడ పై గిల్లాడు. ఈ వీడియోని ఆర్జీవి షేర్ చేస్తూ..
“హీరోయిన్ల భవిష్యత్తు గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది.. సో సాడ్” అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇది కొత్త వీడియో ఏమీ కాదు. గతంలో అఖిల్ నటించిన ‘మిస్టర్ మజ్ను’ చిత్రానికి ముఖ్య అతిధిగా విచ్చేశాడు ఎన్టీఆర్. ఆ వేడుకలో భాగంగా ఈ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది.
Am feeling so sad for heroines😢😢😢😫😫😫 pic.twitter.com/cK64qdQi4n
— Ram Gopal Varma (@RGVzoomin) April 8, 2021
Most Recommended Video
వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!