సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న రిలీజ్ నెగిటివ్ టాక్ మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై మొదటి నుండి భారీ అంచనాలు ఉండటంతో మొదటి వీకెండ్ అదిరిపోయే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. అందువల్ల 70 శాతం రికవరీ ఓపెనింగ్ వీకెండ్ లో సాధించే అవకాశం దక్కింది.
కానీ ఆ తర్వాత కలెక్షన్స్ బాగా తగ్గాయి. వీకెండ్స్ లో, హాలిడేస్ లో పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ… వీక్ డేస్ లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోతుంది. అయితే కిందా మీదా పడి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి దగ్గర పడింది. ఒకసారి ‘కూలీ’ 17 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 16.10 cr |
సీడెడ్ | 6.32 cr |
ఉత్తరాంధ్ర | 5.56 cr |
ఈస్ట్ | 2.86 cr |
వెస్ట్ | 2.36 cr |
గుంటూరు | 3.03 cr |
కృష్ణా | 2.84 cr |
నెల్లూరు | 1.68 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 40.75 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) | 2.64 cr |
ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 3.55 cr |
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) | 46.94(షేర్) |
‘కూలీ'(తెలుగు వెర్షన్) చిత్రానికి రూ.46.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.47 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 18 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.46.94 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.80.73 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో 0.06 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.