Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ‘కూలీ’ రూపొందింది. ఆగస్టు 14న విడుదల కానుంది. ట్రైలర్ కి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. నాగ్ ఫ్యాన్స్ ఆ ట్రైలర్ ను బాగానే మోశారు. తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’ ట్రైలర్ బాగానే మార్మోగింది. ట్రైలర్లో కథ ఏంటో చెప్పకుండా కథనంపై హింట్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్యారెక్టర్ లుక్ ను చూపించడానికే ట్రైలర్ కట్ సరిపోయింది.

Coolie

ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఇప్పటికే ‘కూలీ’ కి కావలసినంత బజ్ ఏర్పడింది. కచ్చితంగా ఫస్ట్ డే ఈ సినిమాని చూడాలని తపించే ప్రేక్షకులు ఉన్నారు.’వార్ 2′ వంటి పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా… ‘కూలీ’ కి ఉండే రీచ్ ‘కూలీ’ ఉంటుందనే చెప్పాలి.

ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాల్లో ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఖైదీ’ క్లైమాక్స్ కావచ్చు.. ‘విక్రమ్’ లో సూర్య పాత్ర కావచ్చు.. ఆ సినిమాలకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ఆడియన్స్ సంతృప్తితో థియేటర్ల నుండి బయటకు వచ్చారు. ‘కూలీ’ లో కూడా అలాంటి సర్పైజ్..లు ప్లాన్ చేశాడట లోకేష్. ‘కూలీ’ లో రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి హీరోలు నటిస్తున్నారు. మరో ఇద్దరు హీరోలు కూడా గెస్ట్ రోల్స్ చేశారట. వాళ్ళు మరెవరో కాదు శివ కార్తికేయన్, జీవ. ‘కూలీ’ లో వీళ్ళ రోల్స్ సర్ప్రైజింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. వీటిలో ఎంతవరకు నిజముందో ఆగస్టు 14న తెలుస్తుంది.

విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus