ఫస్ట్ లుక్ వచ్చిందో లేదో.. అప్పుడే కాపీ అంటున్నారు..!

‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రం విడుదలయ్యి దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు అల్లు అర్జున్. అంతేకాదు వీటితో పాటూ మరో రెండు చిత్రాలని కూడా లైన్లో పెట్టేసాడు. ఇందులో ఒకటి సుకుమార్ డైరెక్షన్లో కాగా మరొకటి దిల్ రాజు నిర్మాణంలో ‘ఎం.సి.ఏ’ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో మరో చిత్రం కావడం విశేషం. సుకుమార్ సినిమా సంగతి పక్కన పెడితే.. వేణూ శ్రీరామ్ డైరెక్షన్లో చేయబోయే సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు ఏమీ బయటకి రాలేదు కానీ ఆ చిత్ర కథ ఇదేనంటూ అప్పుడే వార్తలు మొదలయ్యిపోయాయి.

వివరాల్లోకి వెళితే.. ‘ఐకాన్’ అనే పేరుతో రూపొందనున్న ఈ చిత్రం కథ.. రెండేళ్ల క్రితం ఫిలిప్పైన్స్ లో వచ్చిన ‘కిటకిట’ అనే చిత్రానికి కాపీ అంటున్నారు కొందరు ఫిలిం విశ్లేషకులు. అయితే ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో నటించేంత అంశాలేమీ ఉండవు. ఓ ప్రమాదంలో కళ్ళు పోగొట్టుకున్న హీరోయిన్.. హీరో కోసం వెతికే క్రమంలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆ సంఘటనలేమిటి అనేది మిగిలిన కథ. ఈ చిత్రంలో చాలా డ్రామా ఉంటుంది. మరి బన్నీ లాంటి హీరోతో ఈ చిత్రం చేయాలంటే చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. దిల్ రాజు దగ్గరుండి ఆ మార్పులు కచ్చితంగా చేయిస్తాడని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus