Hi Nanna: నాని సినిమా మీద కాపీ మరక.. చూసినోళ్లు ఏమంటున్నారంటే?

సినిమాల మీద కాపీ మరకలు రావడం ఈ రోజుల్లో కొత్తేం కాదు. అందుకేనేమో మన సినిమా జనాలు ఆ విషయాన్నే పట్టించుకోవడం మానేశారు. ఎవరైనా ఆ సీన్‌ అక్కడి నుండి ఎత్తేశారు, ఈ ఫైట్‌ దీనిలో ఉంది అంటే ‘అవునా’ అనేస్తున్నారు. అయితే ఇలాంటి మరకలు కొంతమందికి మాత్రమే ఉంటూ వచ్చాయి. కొత్త దర్శకుల విషయంలో ఇలాంటి కాపీ రిమార్క్‌లు తక్కువగా ఉంటాయి. అలాంటిది శౌర్యువ్‌ (Shouryuv) అనే దర్శకుడు మీద ఇప్పుడు మరక పడింది.

Hi Nanna

శౌర్యువ్‌ అంటే గుర్తుంది కదా.. ప్రముఖ కథానాయకుడు నాని  (Nani) , మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)  జోడీగా ‘హాయ్‌ నాన్న’  (Hi Nanna)  అనే సినిమా చేశాడు. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి విజయం అందుకుంది. నటుడిగా నానికి, నటిగా మృణాల్‌కి, బాలనటిగా కియారాకు  (Kiara Khanna) మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాకే ఇప్పుడు కాపీ రిమార్క్‌ వచ్చింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత ఆ సినిమా మీద మండిపడుతున్నారు.

తమ బ్యానర్‌లో తెరకెక్కిన ‘భీమసేన నలమహారాజ’ అనే కన్నడ సినిమాకు ‘హాయ్‌ నాన్న’ సినిమాకు పోలికలు ఉన్నాయి అనేది ఆ చిత్ర నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య వాదన. 2020లో తమ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యిందని.. ఆ సినిమాలోని కథను నాని ‘హాయ్ నాన్న’ సినిమాలో వాడారని మల్లికార్జునయ్య అభియోగాలు వేస్తున్నారు. దీంతో ఆయన కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు రెండు సినిమాల కంటెంట్ ఎలా ఉంది అని చెక్‌ చేస్తున్నారు.

చాలా మంది ఈ రెండు సినిమాల కథలు పూర్తిగా వేరని చెబుతున్నారు. కొంతమేర సీన్స్ ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నట్లు అనిపిస్తోందని అంటున్నారు. మరికొంతమందేమో ఇది ఫ్రీమేక్‌ అని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంలో దర్శకనిర్మాతలు, హీరో ఏమంటారో చూడాలి. ఏదేమైనా ఇలాంటి కామెంట్లు లేనిపోని సమస్యకు దారితీస్తాయి. ‘హాయ్‌ నాన్న’ వచ్చాక ఇన్ని రోజులకు పుష్కర మల్లికార్జునయ్య బయటకు రావడం ఏంటి అనేది కూడా ఓ డిస్కషన్‌ పాయింట్‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus