‘ధమాకా’ తో వంద కోట్ల క్లబ్లో చేరాడు దర్శకుడు త్రినాధ్ రావ్ నక్కిన (Trinadha Rao) . ఆ సినిమాకి ప్రసన్న కుమార్ బెజవాడ (Prasanna Kumar) కథ, స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. కాబట్టి.. ఆ కాంబోలో మరో సినిమా వస్తుంది అంటే.. అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు ట్రేడ్లోనూ మంచి అంచనాలు ఏర్పడతాయి. అందుకే ‘మజాకా’ (Mazaka) పై అంచనాలు ఏర్పడ్డాయి. సందీప్ కిషన్ కూడా ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) ‘రాయన్’ (Raayan) వంటి సినిమాలతో ఫామ్లోకి వచ్చాడు.
పైగా ‘మజాకా’ టీజర్, ట్రైలర్స్ వంటివి ఆడియన్స్ ని బాగానే అట్రాక్ట్ చేశాయి. కానీ సినిమాకి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. రెగ్యులర్ స్టోరీ, సెకండాఫ్ బాలేదు అనే కంప్లైంట్స్ ఉన్నాయి. అయితే కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘మజాకా’ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించినందుకు గాను రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడకి రూ.2.5 కోట్లు పారితోషికం ఇచ్చారట.
ఈ రేంజ్ పారితోషికం ఒక రైటర్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. అయితే ‘మజాకా’ కథ మొత్తం ప్రసన్న రాసింది కాదట. మరో 5 మంది రైటర్లు కూర్చుని పనిచేస్తే వచ్చిన ఐడియా అది అని తెలుస్తుంది. స్క్రీన్ ప్లేలో కూడా కన్ఫ్యూజన్ అందుకే ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు.
మరోపక్క ‘మజాకా’ కథ నాదే అంటూ ఓ రైటర్ ఛాంబర్ ను ఆశ్రయించాడట. రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడపై అతను కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం చిరంజీవి (Chiranjeevi) వరకు వెళ్లినట్లు టాక్. అందుకే కంప్లైంట్ చేసిన రైటర్ కి రూ.25 లక్షలు ఇచ్చి సెటిల్ చేసినట్టు వినికిడి.