రామ్ పోతినేని (Ram) ఒక హిట్టు కోసం చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) తర్వాత అతను చేసిన ‘రెడ్’ (RED) పర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత వచ్చిన ‘ది వారియర్'(The Warriorr) ‘స్కంద’ (Skanda) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి సినిమాలు నిరాశపరిచాయి. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై జాగ్రత్త వహించాడు. కొంత గ్యాప్ తీసుకుని ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) ఫేమ్ పి.మహేష్ బాబు (Mahesh Babu P) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
‘మిస్టర్ బచ్చన్ ‘ (Mr Bachchan) బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse) ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో జరుగుతుంది. ఈ కథ ప్రకారం మొత్తం గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా చిత్రీకరణ చేయాల్సి ఉంటుందట.
ఇక తమిళంలో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్లు అయినటువంటి వివేక్ – మార్విన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇది ఒక బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తుంది. కాబట్టి.. మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉండాలని దర్శకుడు భావించి.. వివేక్- మార్విన్ (Vivek Mervin) ..లను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం రామ్ రైటర్ గా మారబోతున్నాడట.
అలా అని అతను డైలాగులు రాస్తాడని కాదు.. స్క్రీన్ ప్లేలో భాగం అవుతాడు అని కూడా కాదు. ఒక పాట కోసం లిరిక్స్ రాస్తున్నాడట. ఈ సాంగ్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని టాక్. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ (Mohanlal) లేదా ఉపేంద్ర (Upendra Rao) కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.