టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా నుండి గ్లోబల్ స్టార్‌గా డెవలప్ అయిన ప్రభాస్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ అది ప్రపంచమంతా తెలిసిపోతుంది. ‘బాహుబలి’ నుండి విదేశాల్లోనూ ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నారు ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరికలేకుండా బిజీగా ఉన్నారు. వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?.. తను ఉండే ఇంటి నుండి వాడే కార్ల వరకు.. ఇష్టంగా కట్టించుకున్న ఫామ్ హౌస్ నుండి చేతికి పెట్టుకునే వాచెస్ వరకు దేని రేటు ఎంత అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
1. యూవీ క్రియేషన్స్‌లో షేర్..
ప్రభాస్ సోదరుడు ప్రమోద్, అతని స్నేహితుడు వంశీ కలిసి యూవీ క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ప్రభాస్‌కి ఇందులో షేర్ ఉంది. దాని నెట్ వర్త్ రూ. 300 నుండి 500 కోట్లు..
2. లగ్జీరీ హౌస్..
జూబ్లీ హిల్స్ ఏరియాలో ప్రభాస్ ఉంటున్న ఇంటి వాల్యూ అక్షరాలా రూ. 80 కోట్లు..
3. ఫామ్ హౌస్..
ప్రభాస్ తనకి నచ్చినట్టు జూబ్లీ హిల్స్ ఏరియాలోనే.. దూరంగా ఎత్తైన ప్రదేశంలో నిర్మించుకున్న ఫామ్ హౌస్ కాస్ట్ రూ. 60 – 80 కోట్లు..
4. రోల్స్ రాయిస్..
డార్లింగ్ దగ్గరున్న స్వాంకీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఖరీదు రూ. 8 కోట్లు..
5. లంబోర్ఘిని అవెంటడోర్..
తన దగ్గరున్న మరో స్వాంకీ లంబోర్ఘిని అవెంటడోర్ రూ. 6 కోట్లు ఉంటుంది..
6. రేంజ్ రోవర్..
ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా ఉండే రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ధర రూ. 3 కోట్లు..
7. జాగ్వార్ కార్..
డార్లింగ్ గ్యారేజ్‌లో రూ. 2.10 కోట్ల విలువ చేసే జాగ్వార్ ఎక్స్‌జెఆర్ మోడల్ కార్ కూడా ఉంది..
8. జిమ్ సెటప్..
మనోడు ఫిజిక్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిందే.. ఇంట్లోనే ప్రత్యేకంగా జిమ్ సెటప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్విప్‌మెంట్ మొత్తం కలిపి జిమ్ సెటప్ రూ. 2 కోట్లు..
9. బీఎండబ్యూ..
ప్రభాస్ దగ్గర రూ. 70 లక్షలు విలువ గల బీఎండబ్ల్యూ ఎక్స్3 కార్ కూడా ఉంది..
10. గోల్డ్ వాచ్..
పాన్ ఇండియా స్టార్ దగ్గర కార్లతో పాటు ఖరీదైన వాచెస్ కూడా ఉన్నాయి.. వాటిలో రోలెక్స్ యాచ్ మాస్టర్ II గోల్డ్ కాస్ట్ రూ. 28 లక్షల 57 వేలు..
11. కాస్మోగ్రాఫ్ డేటోనా 18CT వాచ్..
డార్లింగ్ దగ్గరున్న రోలెెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా 18CT గోల్డ్ కేస్ వాచ్ ప్రైస్ రూ. 27 లక్షలు..
12. మరో కాస్ట్లీ వాచ్..
పలు సందర్భాల్లో ప్రభాస్ పెట్టుకున్న హబ్లాట్ బిగ్ బ్యాంగ్ సాంగ్ బ్లూ ఆల్ వైట్ వాచ్ రేటు రూ. 13 లక్షలు..