‘నాగార్జున ఇంట్లో హీరోయిన్లు ఉన్నారు కదా.. వాళ్ల బొమ్మలు పెట్టొచ్చు కదా..?’

కమ్యూనిస్టు నాయకుడు సీపీఐ నారాయణ పార్టీ విషయాలను పక్కనపెట్టి ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ షోపై పడ్డారు. బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి నారాయణ కూడా ఒక వీడియో విడుదల చేస్తుంటారు. బిగ్ బాస్ ని టార్గెట్ చేస్తూ.. హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తుంటారు. అదొక బూతుల ప్రపంచమని విరుచుకుపడుతుంటారు. ఈ బిగ్ బాస్ షో వలన సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని.. కేంద్రప్రభుత్వం ఇలాంటి షోలను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

Click Here To Watch

బిగ్ బాస్ షోని బ్రోతల్ హౌస్ తో పోల్చారు. నాగార్జునను కూడా బాగా తిడుతుంటారు. తాజాగా మరోసారి బిగ్ బాస్ షోపై మండిపడ్డారు నారాయణ. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బిగ్ బాస్ షో గురించి మాట్లాడారు. ‘ముగ్గురు అమ్మాయిల్ని చూపించి.. ఏ అమ్మాయిని ముద్దుపెట్టుకుంటావ్.. ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావ్.. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావ్’ అని అడుగుతున్నారు.. నాగార్జున ఇంట్లో కూడా హీరోయిన్లు ఉన్నారు కదా..

మరి వాళ్ల బొమ్మలు అక్కడ పెట్టొచ్చు కదా ‘ అని ఫైర్ అయ్యారు నారాయణ. గేమ్‌ని గేమ్‌ని గేమ్‌లా చూడొచ్చు కదా.. నాగార్జున గారంటే అంత కోపమా? అని ప్రశ్నించగా.. ‘గేమ్ ఏంటండీ గేమ్.. అది గేమ్ కాదు క్రైమ్.. నాగార్జున అంటే కోపం కాదు.. అసహ్యం’ అంటూ మండిపడ్డారు నారాయణ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం నారాయణను తిట్టిపోస్తున్నారు.

పొలిటికల్ పంచ్‌లు పెద్దగా పేలకపోవడంతో పాటు ఆయన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో బిగ్ బాస్ షో మీద పడ్డారంటూ కౌంటర్లు వేస్తున్నారు. నారాయణ మాత్రం నెగెటివిటీను పట్టించుకోకుండా.. బిగ్ బాస్ షోపై దారుణమైన కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus