బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ మరోసారి ప్రభాస్..?

ప్రస్తుతం ‘జిల్’ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో తన 20 వ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 25 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే తదుపరి షెడ్యూల్ కి కాస్త గ్యాప్ రావడంతో ప్రభాస్ రిలాక్స్ అవుతూ తన తదుపరి సినిమా కోసం కథలు వింటున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా తన తదుపరి సినిమాను కూడా బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితోనే చేయాలని ప్రభాస్ అనుకుంటున్నాడట.

‘బాహుబలి’ కి ముందు ప్రభాస్ కు ‘మిర్చి’ లాంటి అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివతో తన 21 వ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ మధ్యే ప్రభాస్ ను కలిసి ఓ లైన్ చెప్పాడట కొరటాల. లైన్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట ప్రభాస్. ఎలాగూ కొరటాల పై ప్రభాస్ కు గట్టి నమ్మకం ఉంది. అయితే కొరటాల ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాకే ప్రభాస్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ లోపు ప్రభాస్ కూడా ‘జాన్’ చిత్రాన్ని పూర్తిచేస్తాడన్న మాట..! ఏమైనా కొరటాల- ప్రభాస్ కాంబో అంటే అభిమానులకి కిక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి..!

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus