వకీల్ సాబ్ టీజర్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

పవన్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది, కరోనా వైరస్. రెండేళ్లుగా ఆయన నుండి మూవీ లేక దాహంతో ఉన్న ఫ్యాన్స్ వకీల్ సాబ్ కోసం ఎదురు చూస్తున్నారు. మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది, మే లో విడుదల ఉంటుంది అనగా లాక్ డౌన్ దెబ్బేసింది. మూడునెలలు నిరవధికంగా సాగిన లాక్ డౌన్ తో షూటింగ్ ముందుకు వెళ్ళలేదు. ఇక లాక్ డౌన్ కి సడలింపు ఇవ్వడంతో పాటు, షూటింగ్స్ కి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా కూడా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగ్ జరపడం లేదు.

ఒక వేళ రిస్క్ చేసి షూటింగ్ పూర్తి చేసినా, థియేటర్స్ బంద్ లో ఉన్న కారణంగా విడుదలకు అవకాశం లేదు. కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలివున్న వకీల్ సాబ్ మూవీ సాధారణ పరిస్థితులు ఏర్పడితే వెంటనే విడుదల అవుతుంది. ఐతే కరోనా ఉధృతి అంతకంతకు పెరుగుతూ పోతుంది. దీనితో ఇప్పట్లో షూటింగ్స్ జరుపక పోవచ్చు అని చాలా మంది టాలీవుడ్ లో అనుకుంటున్నారు. కాగా పవన్ ఫ్యాన్స్ కి ఈ నిరాశ నుండి కొంచెం ఉపశమనం కల్పించడం కోసం, వకీల్ సాబ్ టీమ్ ఓ సర్ప్రైజ్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు కానుకగా వకీల్ సాబ్ టీజర్ విడుదల కానుందట.మరి ఇదే కనుక నిజమైతే పవన్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus