క్రష్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 9, 2021 / 10:32 PM IST

“లడ్డు బాబు, అవును 2, అదుగో, ఆవిరి” లాంటి డిజాస్టర్ ఎక్స్ పెరిమెంట్స్ అనంతరం రవిబాబు మళ్ళీ తన పాత ఒరవడిలో తీసిన సినిమా “క్రష్”. యువతకి శృంగారం మీద ఉండే ఆసక్తి, యావ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కుదరకపోవడంతో నేడు (జూలై 09) జీ5 యాప్ లో సడన్ రిలీజ్ అయ్యింది. నిజానికి ఈ సినిమా ఈ యాప్ లో విడుదలైనట్లు విడుదలయ్యేవరకూ ఎవరికీ తెలియదు. మరి రవిబాబు మార్క్ రోమాంటిక్ కామెడీ ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: రవి (అభయ్ సింహా), తేజు (కృష్ణ బూరుగుల), వంశీ (చరణ్ సాయి) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లడానికి సన్నద్ధమవుతుంటారు. అమెరికా వెళ్ళి చదువుకోవడం కంటే అమ్మాయిలతో ఫ్రెండ్ చేయడమే పెద్ద పని అని మరో ఫ్రెండ్ చెప్పడంతో.. అమెరికా వెళ్లడానికి ముందే తన కన్నెరికాన్ని కోల్పోవాలని ప్రయత్నాలు మొదలెడతారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన తప్పులు, ఆ తప్పుల నుంచి నేర్చుకున్న ఒప్పులు, జీవిత సత్యాలు ఏమిటి? అనేది “క్రష్” కథాంశం.

నటీనటుల పనితీరు: దాదాపుగా అందరూ కొత్తవారే. ఎవరి నుంచి అత్యుత్తమ నట ప్రదర్శన ఆశించలేము. అలాగే.. ఎవరూ మరీ తక్కువ నట ప్రతిభ కనబరచలేదు. ఒక పాత్రకి ఎంతవరకూ అవసరమో, అంతవరకూ పర్వాలేదనిపించుకున్నారు. టిపికల్ రవిబాబు హిస్ట్రానిక్స్ ను రిపీట్ చేయడంలో అందరూ సఫలీకృతులయ్యారు. హీరోయిన్లు అంకిత, పర్రే పాండే, శ్రీసుధలు అవసరానికి మించి అందాల ఆరబోతతో అలరించారు. అయితే.. వాళ్ళ ఎక్స్ పోజింగ్ ఎక్కడా పరిమితి దాటినట్లు కనిపించకపోవడం విశేషం.

దర్శకుడిగా రవిబాబు ప్రత్యేకత ఏమిటంటే.. అప్పటివరకూ మనం కొన్ని వందల సినిమాల్లో చాలా రొటీన్ రోల్స్ పోషించగా చూసిన ఆర్టిస్టులతో భిన్నమైన క్యారెక్టర్స్ పోషించేలా చేయడం. ఈ సినిమాలోనూ ***** తో గే క్యారెక్టర్ ప్లే చేయించి, ఒకరకంగా మంచి మెసేజ్ ఇచ్చాడు.

సాంకేతికవర్గం పనితీరు: సమాజానికి మెసేజులు ఇవ్వడంతో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన శైలి. బాపు-రమణలు నీతి కథలతో బంధాలను-అనుబంధాలను వివరించేవారు, దాసరి కాస్త విపులంగా పెద్దలంటే గౌరవముండాలి, తల్లిదండ్రులంటే బాధ్యత ఉండాలి అని చెప్పుకొచ్చేవాడు, పూరీ జగన్నాధ్ కాస్త కఠినంగా జీవిత సత్యాలను నేర్పించేవాడు, ఇక రవిబాబు విషయానికి వచ్చేసరికి “అల్లరి” మొదలుకొని ఇప్పటివరకూ ప్రతి సినిమాలోనూ తాను చెప్పే నీతులకి, సూత్రాలకి కాస్త వ్యంగాన్ని, హాస్యాన్ని, రొమాన్స్ ని జోడించి చెబుతాడు. అందులో కొన్ని ఫలిస్తాయి, ఇంకొన్ని విఫలమవుతాయి.

చాలావరకూ విఫలమైనవే కానీ.. “క్రష్” మాత్రం మధ్యస్తంగా ఉండిపోయింది. అర్ధవంతంగా చెప్పడంలో రవిబాబు ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటాడు. “క్రష్” విషయంలోనూ అదే జరిగింది. నేటి యువతకు శృంగారం మీద అవగాహన ఎంత ముఖ్యం అనేది రవిబాబు చెప్పాలనుకున్న పాయింట్. అయితే అది సరిగా ఎలివేట్ అవ్వలేదు. అమ్మాయిల్ని శృంగారం విషయంలో బలవంతం చేయకూడదు, వాళ్ళ అంగీకారం లేనిదే వారిని తాకారాదు వంటి నీతి సూత్రాలను వల్లించడంలో సఫలీకృతుడయ్యాడు. అయితే.. ఆ చెప్పిన విధానం మాత్రం అర్ధం చేసుకొనే విధంగా లేకపోవడం గమనార్హం.

కెమెరా పనితనం, సంగీతం, కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ప్రతి విషయంలోనూ రవిబాబు మార్కే కనిపిస్తుంది.

విశ్లేషణ: ఒక చెత్త విషయాన్ని ఎంత మంచిగా వివరించినా పెద్దగా ఉపయోగం ఉండదు. అలాగే ఒక మంచి విషయాన్ని చెత్తగా చెప్పడం వల్ల కూడా ఉపయోగం ఉండదు. ఈవీవీ గారు “కితకితలు” సినిమాలో ప్రేమ శరీరాకృతిని బట్టి కాక మనసుని బట్టి పుట్టాలి అని ఎంత వివరించినా జనాలు కామెడీని మాత్రమే చూశారు. రవిబాబు “క్రష్”తో శృంగారం అనేది అమ్మాయి-అబ్బాయి ఇష్టపూర్వకంగా చేసుకోవాలి కానీ బలవంతంగానో లేక అయిష్టంగా చేయకూడదు అలాగే.. పిల్లలకి ఒక వయసుకి వచ్చాక శృంగారం గురించి కొన్ని విషయాలను పెద్దలు వివరించడం ఎంత ఇంపార్టెంట్ అనే విషయాలని ప్రస్తావించడం వరకూ బాగానే ఉంది కానీ.. వివరించిన విధానమే బాగోలేదు. నిజానికి ఈ తరహా సినిమాలు ప్రస్తుత సమాజానికి అవసరంమ కానీ తెరకెక్కించాల్సిన విధానం ఇది కాదు. ఈ విషయాన్ని రవిబాబు కాస్త బుర్రాకి ఎక్కించుకొని మళ్ళీ మంచి కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం.

రేటింగ్: 1.5/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus