Custody Collections: ‘కస్టడీ’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Advertisement

అక్కినేని నాగచైతన్య హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘కస్టడీ’. ‘బంగార్రాజు’ తర్వాత కృతి శెట్టి మరోసారి నాగ చైతన్య సరసన నటిస్తుంది. పవన్ కుమార్ సమర్పణలో ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ప్రియమణి, అరవింద స్వామి, శరత్ కుమార్ వంటి స్టార్లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ లో రూపొందిన పాటలు పర్వాలేదు అనిపించాయి. మే 12న రిలీజ్ అయిన ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది. కానీ ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్లో అయితే నమోదు కాలేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.31 cr
సీడెడ్ 0.43 cr
ఉత్తరాంధ్ర 0.47 cr
ఈస్ట్ 0.27 cr
వెస్ట్ 0.22 cr
గుంటూరు 0.36 cr
కృష్ణా 0.29 cr
నెల్లూరు 0.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.23 cr
తమిళనాడు 0.25 cr
ఓవర్సీస్ 1.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.02 cr (షేర్)

‘కస్టడీ’ (Custody) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.22.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.23.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.5.02 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ రూ.18.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది అంత ఈజీ టార్గెట్ అయితే కాదు.. చూడాలి మరి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus