అక్కినేని నాగచైతన్య తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా మే 12వ తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగచైతన్యకు ఇది మొట్టమొదటి తమిళ సినిమా అని కూడా చెప్పాలి. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రసారమవుతుండగానే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.
సినిమా (Custody) థియేటర్లు విడుదలైన తర్వాత భారీ ధరలకు ఆ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా డిజిటల్ హక్కులను డిజిటల్ కంపెనీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీ రేటుకే హక్కులు పొందిందని సమాచారం. ఇటీవల కాలంలో సినిమాలు నెగటివ్ టాక్ వస్తే నెల రోజుల్లోనే ఓటీటీలో ప్రసారమవుతున్నాయి.
ఈ క్రమంలోనే వందల కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాలు సైతం నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో నెల తిరగకుండానే డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్నాయి. అయితే నాగచైతన్య కస్టడీ సినిమా కూడాపెద్దగా కలెక్షన్లను కూడా రాబట్టకపోవడంతో ఈ సినిమాని కూడా త్వరలోనే డిజిటల్ మీడియాలో ప్రసారం చేయాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా జూన్ మొదటి వారంలోనే నెట్ ఫ్లిక్స్ లోప్రసారం కాబోతుందని వార్తలు వస్తున్నాయి.
అయితే త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన తెలియజేయనున్నారు. కస్టడీ చిత్రం థియేట్రికల్‌గానూ, ఓటీటీ పరంగానూ మంచి రేటుకే అమ్ముడు పోయింది. రిలీజ్ కి ముందే నిర్మాతలు సేఫ్‌లో ఉన్నారు. సుమారు 23కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయనీ సమాచారం.