Daaku Maharaaj Collections: ‘డాకు మహారాజ్’… ఇలా డ్రాప్ అవుతుందని అనుకోలేదు..!

వరుస విజయాలతో సూపర్ ఫామ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ తో (Daaku Maharaaj) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పెద్దగా అంచనాలు లేకుండా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ వచ్చింది. దర్శకుడు బాబీ (K. S. Ravindra) స్క్రీన్ ప్లే కొత్త ఫీలింగ్ ఇచ్చింది. నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi)  ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. పాజిటివ్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam)   వచ్చాక ‘డాకు కలెక్షన్స్’ తగ్గాయి.

Daaku Maharaaj Collections:

దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టంగా మారింది. ఒకసారి (Daaku Maharaaj)  9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 12.86 cr
సీడెడ్ 11.12 cr
ఉత్తరాంధ్ర 9.80 cr
ఈస్ట్ 6.55 cr
వెస్ట్ 4.96 cr
గుంటూరు 7.34 cr
కృష్ణా 5.18 cr
నెల్లూరు 3.09 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 60.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.65 cr
ఓవర్సీస్ 7.72 cr
టోటల్ వరల్డ్ వైడ్ 72.27 cr (షేర్)

‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 9 రోజుల్లో ఈ సినిమా రూ.73.46 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.10.04 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వారం కూడా గట్టిగా రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

‘గేమ్ ఛేంజర్’.. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్నాడు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus