మంచు మనోజ్ గత 2 నెలలుగా చేసిన, చేస్తున్న హడావిడి అందరికీ తెలిసిందే. మనోజ్ (Manchu Manoj) సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్తలకంటే.. అవే బాగా హాట్ టాపిక్ అయ్యాయి. మనోజ్ తన అన్న విష్ణు (Manchu Vishnu), తండ్రి మోహన్ బాబులపై (Mohan Babu) పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అటు తర్వాత మోహన్ బాబు కూడా మనోజ్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అటు తర్వాత మనోజ్.. మోహన్ బాబు ఇంటికి మీడియాతో వెళ్లి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.
అంతా సెట్ అయిపోయింది అనుకున్న టైంలో.. విష్ణు వెళ్లి మనోజ్ ఇంటి జెనరేటర్లో పంచదార పోయడంతో మళ్ళీ గొడవలు మొదటికి వచ్చినట్టు అయ్యింది. అయితే వాటిని జనాలు కానీ, మీడియా కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో మనోజ్, విష్ణు డిజిటల్ కి షిఫ్ట్ అయ్యారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో మోహన్ బాబు సినిమాల్లోని డైలాగులతో మనోజ్, విష్ణు..లు సెటైర్లు వేసుకున్న సంగతి తెలిసిందే. ఇవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
ఇలాంటి టైంలో మనోజ్ (Manchu Manoj).. ఓ సినిమా వేడుకకు హాజరవుతున్నారు అంటే.. అక్కడ ‘ఏం మాట్లాడతాడా’ అనే ఆసక్తి అందరిలో ఏర్పడుతుంది. ఇక ‘క్యూ అండ్ ఎ’ కనుక జరిగింది అంటే.. ఆ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. బహుశా అందుకే అనుకుంటా.. ఈవెంట్ నిర్వాహకులు క్యూ అండ్ ఎ సెషన్ తీసేశారు. ఇక మనోజ్ ‘తన ఎనర్జిటిక్ స్పీచ్ తో ఈవెంట్ ను బాగానే రక్తికట్టించాడు.
ఎటువంటి వివాదాలకు తావివ్వలేదు’ అనుకుంటున్న టైంలో చివర్లో మైక్ తీసుకుని.. ‘చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకుని మార్కెట్లో అమ్ముడు పోవడానికి నేను కాయ, పండు కాదు మనోజ్ని’ అంటూ ఓ డైలాగ్ చెప్పాడు. ఇది ఎందుకు చెప్పాడు.. ‘భైరవం’ టీజర్లో ఉందా? అంటే లేదు. సినిమాలో ఉందేమో అని కొందరు అనుకుంటున్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం ‘ఇది విష్ణు పై సెటైరికల్ డైలాగ్’ అని భావిస్తున్నారు. అలా ఇది వైరల్ అవుతుంది.
చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకుని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయ, పండు కాదు మనోజ్ని : మంచు మనోజ్#ManchuManoj #Bhairavam pic.twitter.com/vDDpD5ZgFR
— Filmy Focus (@FilmyFocus) January 20, 2025