Kiran Abbavaram: తండ్రి కాబోతున్న కిరణ్‌ అబ్బవరం.. భార్యతో కలసి ఫొటోలు షేర్‌ చేసిన నటుడు!

‘క’ సినిమాతో రీసెంట్‌గా బ్లాక్‌బస్టర్‌ కొట్టిన యువ కథానాయకుడు త్వరలో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) తండ్రి కాబోతున్నాడు. Our love is growing by 2 feet అంటూ తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ మేరకు తన భార్య రహస్య గోరఖ్‌తో (Rahasya Gorak) కలసి దిగిన రెండు ఫొటోలను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి అని త్వరలో తాము అమ్మానాన్నలం అవుతున్నాం అనేది ఆయన పోస్ట్‌ సారాంశం. దీంతో ఇద్దరికీ అభిమానుల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Kiran Abbavaram

Our love is growing by 2 feet అంటే ఏంటి అనేగా మీ డౌట్‌. తమ ప్రేమ రెండు పాదాల మీద పెరుగుతోంది.. త్వరలో మేం తల్లిదండ్రులం అవుతున్నాం అని చెప్పడానికి ఇంగ్లిష్‌లో అలా చెబుతారు లెండి. కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) – నటి రహస్య గోరఖ్‌ (Rahasya Gorak) గత కొన్నేళ్లుగా ప్రేమించుకుని గతేడాది ఆగస్టు 22న పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇలా గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ‘క’ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే వీరి పెళ్లి జరిగింది.

గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలు అందుకుంటున్న కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ఆ సినిమాతో భారీ హిట్‌ కొట్టారు. కిరణ్‌ (Kiran Abbavaram) తొలి సినిమాలో హీరోయిన్‌గా నటించిన రహస్య గోరఖ్‌ (Rahasya Gorak) .. ‘క’ సినిమాకు సొంత మనిషిగా భాగస్వామి అయింది. దాంతో తిరిగి తాను హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. ఆ ఆనందంలో ఉండగానే ఇప్పుడు తండ్రి అవుతున్న ఆనందం వచ్చి యాడ్‌ అయింది. దీంతో కిరణ్‌కు డబుల్‌ హ్యాపీనెస్‌ అని చెప్పాలి.

ఇక కిరణ్‌ సినిమాల సంగతి చూస్తే.. ‘క’ సినిమాకు ముందు అనౌన్స్‌ చేసిన ‘దిల్ రుబా’ సినిమాను ఇప్పుడు బయటకు తీశారు. ఇటీవల పేరు, పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. త్వరలో సినిమా రిలీజ్‌ విషయంలో స్పష్టత వస్తుంది.

కిరణ్ అబ్బవరం , రహస్యల పెళ్లి ఫోటోలు

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus