దిల్ రాజు (Dil Raju) నివాసంపై ఆదాయపు పన్ను శాఖ వారు సోదాలు నిర్వహించారు. జనవరి 21 అంటే.. మంగళవారం నాడు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఐటీ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. దిల్ రాజు (Dil Raju) ఇంటి పైనే కాకుండా ఆయన ఆఫీస్ పై కూడా ఐటీ రైడ్స్ జరిగాయి. అకౌంట్స్ అన్నీ పూర్తిగా చెక్ చేసి.. ‘ఏమైనా అవకతవకలు ఉన్నాయా?’ అని ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తున్నారట ఐటీ అధికారులు. దిల్ రాజు (Dil Raju) పై మాత్రమే కాదు.. ఆయన తమ్ముడు శిరీష్ ఇంటిపై కూడా ఐటీ రైడ్స్ జరిగాయి. అలాగే దిల్ రాజు (Dil Raju) కూతురు ఇంటిపై కూడా ఐటీ రైడ్స్ జరిగినట్లు సమాచారం.
ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అయ్యింది. అది సరిగ్గా ఆడకపోయినా.. బాక్సాఫీస్ వద్ద రూ.370 కోట్లు కలెక్ట్ చేసినట్లు పోస్టర్స్ బయటికి వచ్చాయి. అంతేకాకుండా ఆ సినిమాకు రూ.450 కోట్లు బడ్జెట్ పెట్టినట్టు కూడా మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఇది రూ.55 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్టు కూడా మేకర్స్ తెలియజేశారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రూ.200 కోట్లు కలెక్ట్ చేసినట్లు పోస్టర్స్ వచ్చాయి.
వీటన్నిటినీ ఆధారం చేసుకునే.. దిల్ రాజు అలాగే అతని కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ సోదాలు నిర్వహించినట్టు కొందరు చెప్పుకుంటున్నారు. అయితే ప్రతి ఏడాది ఈ టైంకి జూబ్లీ హిల్స్,బంజారా హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి వంటి ఏరియాల్లో ఉండే పెద్ద వాళ్ళ ఇళ్లపై ఐటీ శాఖ వారు సోదాలు నిర్వహించడం సాధారణమైన విషయమే అని మరి కొందరు అంటున్నారు.