దాదా సాహెబ్‌ పురస్కారాల ప్రకటన.. ఏయే సినిమాలకు వచ్చాయంటే?

  • February 21, 2023 / 07:30 PM IST

ప్రతిష్ఠాత్మక ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ – 2023’ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం రాత్రి ముంబయిలో నిర్వహించిన ఈ వేడుకకు బాలీవుడ్‌ సినీ తారలు హాజరై సందడి చేశారు. ఈ వేడుకల్లో ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్‌ఫైల్స్‌’ అవార్డు దక్కించుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం దక్కింది. మరోవైపు రిషబ్‌శెట్టి మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌ అవార్డును అందుకున్నారు. ‘కాంతారా’లో నటనకు గానూ ఈ అవార్డు వచ్చింది.

ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌ నిలవగా, ఉత్తమ నటిగా ఆలియా భట్‌ నిలిచింది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకుగాను రణ్‌బీర్‌కు, ‘గంగూబాయి కాఠియావాడి’ సినిమాకు గాను ఆలియా భట్‌ పురస్కారం గెలుచుకున్నారు. ఇక దాదా సాహెబ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డును రేఖ స్వీకరించారు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులు. ఆలియా భట్‌ కథానాయిక. ఈ లెక్కన దాదాసాహెబ్‌ అవార్డ్స్‌లో ఉత్తమ పురస్కారాల్లో ఆలియా భట్‌ హవా నడిచింది అని చెప్పొచ్చు.

ఇతర వివరాలు, విజేతలు…

ఉత్తమ చిత్రం: ది కశ్మీర్‌ ఫైల్స్‌

ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆర్‌ఆర్‌ఆర్‌

ఉత్తమ దర్శకుడు: ఆర్‌.బాల్కి (చుప్‌ – ది రివెంజ్‌ ఆఫ్‌ ఆర్టిస్ట్‌)

ఉత్తమ నటుడు‌: రణ్‌బీర్‌ కపూర్‌ (బ్రహ్మాస్త్ర)

ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)

ఉత్తమ సహాయ నటుడు: మనీష్‌ పాల్‌ (జుగ్‌ జుగ్‌ జీయో)

మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌: రిషబ్‌ శెట్టి (కాంతారా)

క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌: వరుణ్‌ ధావన్‌ (బేడియా)

మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌: అనుపమ్‌ ఖేర్‌

క్రిటిక్స్‌ ఉత్తమ నటి: విద్యాబాలన్‌ (జల్సా)

టీవీ రంగంలో ఉతమ నటుడు: జైన్‌ ఇమ్నాన్‌, ఉత్తమ నటి: తేజస్వీ ప్రకాశ్‌, ఉత్తమ సహాయ నటి: షీబా చద్దా, టీవీ సిరీస్ ఆఫ్‌ ఆది ఇయర్‌: అనుపమ (సీరియల్‌). వెబ్‌ సిరీస్‌లు ఇలా.. ఉత్తమ వెబ్‌సిరీస్‌: ‘రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’, ఉత్తమ నటుడు: జిమ్ షార్బ్ (రాకెట్‌ బాయ్స్‌)

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus