నాన్న ‘కామెంట్’లో కిక్కుంది – అఖిల్!!!

మన టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన నాగ్…అటు హీరోగానే కాకుండా…ఇటు బిజినెస్ మ్యాన్ గా సైతం దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే తన సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, కధను నమ్మి సినిమాలను తెరకెక్కించే నాగ్, తన కుమారుల కరియర్ విషయంలో మాత్రం ఫేల్ అయ్యారనే చెప్పాలి. దానికి గల కారణాలు చాలానే ఉన్నాయి…అందులో మొదటిది…పెద్ద కొడుకు చైతన్య ఇండస్ట్రీకి వచ్చి ఇన్నెళ్లైనా ఒక్క భారీ హిట్ లేకపోవడం, అదే క్రమంలో చిన్న కుమారుడు అఖిల్ తొలి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ కావడం.

ఇలా కుమారుల విషయంలో నాగ్ ఫెయిల్ అయ్యాడనే విషయం టాలీవుడ్ లో హాట్ హాట్ గా విఙిప్సితుంది. ఇదిలా ఉంటే తాజాగా…ఒక ఇంటెర్వ్యు లో అఖిల్ తన రెండో సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని, ఆ సినిమా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తొలి సినిమా ఫలితం చూసి, రెండో సినిమా సరికొత్తగా చెయ్యాలనే ఆలోచనతోనే ముందుకు వెళుతున్నట్లు అఖిల్ తెలిపాడు. ఈ సినిమా మంచి అర్బన్ లవ్ స్టోరీ అని…సమ్మర్ తరువాత షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయం మాత్రం అఖిల్ వెల్లడించలేదు. ఇక మరో పక్క  అఖిల్ రెండో సినిమాను వంశీ పైడిపల్లి చేస్తాడని నాగ్ ఊపిరి సక్సెస్ మీట్ లో చెప్పాడు. ఇక అఖిల్ ఇంటెర్వ్యు లో మరొక విషయం కూడా తెలిపాడు…అదేమిటంటే…’నా తొలి సినిమా అఖిల్ పరాజయం పాలైన సమయంలో నాన్న తనపై ఒక కామెంట్ చేశారని….అదేమిటంటే…ప్రపంచాన్ని కాపాడే వయసు నీకింకా రాలేదని’ అన్నారని అఖిల్ తెలిపాడు. ఆ కామెంట్ ఎప్పటికీ మరచిపోలేనని అఖిల్ చెప్పడం విశేషం. చూద్దాం మరి రెండో సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus