ఆకట్టుకుంటున్న విజయ్ ప్రకాష్ ‘దైవాన్నే అడగాలా’ లిరికల్ వీడియో సాంగ్

సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ పై చిన్ను క్రిష్, గీతిక రతన్ జంటగా, ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ యు రా’. సముద్రాల మంత్రయ్య బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్ సభ్యులు తాజాగా ‘దైవాన్నే అడగాలా’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

విజయ్ ప్రకాష్ పాడిన ఈ పాటకు రాజా రత్నం బాట్లూరి లిరిక్స్ అందించారు. ఈశ్వర్ పెరవలి సంగీతం అందించారు. ఆకట్టుకునే ట్యూన్‌తో సాంగ్‌లో చూపించిన నాచురల్ లొకేషన్స్ హైలైట్ అయ్యాయి. ప్రేమించిన అమ్మాయి కోసం పరితపించే అబ్బాయి మనస్తత్వాన్ని ఈ పాటలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. యూత్ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ విడుదలైన కాసేపట్లోనే భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ఈ చిత్రం నుంచి అంతకుముందు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేసిన ‘యూత్ అబ్బా మేము’ అనే పాటకు కూడా యూట్యూబ్‌లో విశేష స్పందన లభిస్తోంది. విలక్షణ ప్రేమ కథా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు రవి బైపల్లి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో శేఖర్ బండి, సాయినాగ్, మధుప్రియ, దివ్య, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, జబర్దస్త్ చిట్టి బాబు, జబర్దస్త్ కట్టప్ప ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పారు దర్శకనిర్మాతలు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!


ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus