‘మెగా’ దెబ్బ నుంచి కోలుకుంటున్న నిర్మాత!!!

  • February 16, 2016 / 10:53 AM IST

సహజంగా టాలీవుడ్ లో నిర్మాతల లెక్కలు చాలా డిఫేరెంట్ గా ఉంటాయి. ఒక టాప్ హీరో సినిమా అంటే క్యూ లో నిలబడి మరీ భారీ డబ్బులు పెట్టి మరీ డేట్స్ తీసుకుంటారు. అంతేకాకుండా సినిమా కొనే విషయంలో కూడా అంతే సినిమా రేంజ్ బట్టి సినిమాని భారీ మొత్తానికి కొనెస్తూ ఉంటారు. అయితే అలా చేసిన క్రమంలో కొన్ని సార్లు సినిమాలు భారీ హిట్ అయ్యీ మంచి లాభాలను తెచ్చిపెట్టి నిర్మాతకు భారీ సొమ్మును మిగులుస్తాయి. అయితే ఈ విషయంలో మరో కోణం ఉంటుంది, అదే సినిమా ఫ్లాప్ అయితే, ఒక వేళ సినిమా ఫ్లాప్ అయితే, సినిమాకు పెట్టిన డబ్బులు రాకపోగా ఎదురు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్తితుల్లో ఉన్నాడు మన టాలీవుడ్ నిర్మాత డీ.వీ.వీ దానయ్య. మెగా ఫ్యామిలీని నమ్ముకుని పైకి వచ్చిన దానయ్య అదే మెగా హీరో పుణ్యమాఅంటూ అప్పుల పాలు అయిపోయాడు. ఎన్నో అంచనాలతో తాను నిర్మించిన బ్రూస్ లీ చిత్రం డిజాస్టర్ అవగా, తాను వేసుకున్న లెక్కలన్నీ తారుమారయ్యి, మొత్తానికి అటు తిరిగి, ఇటు తిరిగి బయ్యర్లకు కట్టాల్సి వచ్చింది. అయితే ఇప్పుడెప్పుడే కోలుకుంటున్న నిర్మాత తన రాబోయే సినిమాలపై భారీ ప్ల్యాన్స్ వేసుకుంటున్నాడు. అసలైతే రవితేజ హీరోగా తెరకెక్కాల్సిన ‘రాబిన్ హుడ్’ సినిమా రంజిత మూవీస్ నుంచి దానయ్య చేతిలో పడింది.  ఇక ఇప్పటికీ దానయ్య రవి హీరోగా ‘దుబాయ్ సీను’ నిర్మించి మంచి హిట్ కొట్టాడు. మరి ఈ సినిమా కూడా నిర్మాతకు లాభాలను చేకూర్చాలని ఆశిద్దాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus