మరో వివాదంలో ‘దండుపాళ్యం’ హీరోయిన్..?

  • March 20, 2019 / 05:24 PM IST

2002లో వచ్చిన ‘దుష్మణి’ అనే బాలీవుడ్ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యింది పూజా గాంధీ. దాదాపు 30 కన్నడ చిత్రాల్లో నటించింది. తమిళ్, మలయాళం, బెంగాలీ సినిమాల్లో కూడా నటించింది. కన్నడలో చేసిన ‘దండుపాళ్యం’ చిత్రం ఈమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టింది.ఈమె నిత్యం ఏదో ఒక వివాదంతో హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. ఇటీవల ఈమె మరో వివాదంలో చిక్కుంది. దాదాపు 4.5 లక్షలు టోకరా పెట్టి ఈమె జంప్ అయ్యిందని పోలీస్ కేసు ఫైల్ అయ్యిందట.

వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్‌లో పూజా గాంధీ కొన్ని రోజులు స్టే చేసింది. ఆ హోటల్ బిల్లు దాదాపు రూ.4.5 లక్షలు అయ్యిందట. ఆ విషయం తెలుసుకున్న ఆమె బిల్ పూర్తిగా చెల్లించకుండానే అక్కడి నుంచి జంప్ అయ్యిందని తెలుస్తుంది. ఈ విషయం గుర్తించిన హోటల్‌ మేనేజ్మెంట్ స్థానిక పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఫైల్ చేశారు. ఈ విషయం పై ఆమెను పోలీసులు విచారించగా అసలు నిజం చెప్పింది. పూజా 2లక్షల రూపాయల వరకూ బిల్లు చెల్లించానని పోలీసులకి తెలిపింది. అయితే మిగిలిన డబ్బు చెల్లించడానికి కొంచెం సమయం కావాలని పోలీసులను అలాగే హోటల్‌ మేనేజ్మెంట్ ని కోరిందట. ఇందుకు వారు కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా పూజా ఇలా డబ్బులు ఎగ్గొట్టడం అనే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే పూజా గాంధీ ఇలా గొడవల్లోనూ, వివాదాల్లోనూ ఇరుక్కోవడం ఇది మొదటిసారేమీ కాదంట. 2011లో ఆమె ప్రముఖ నిర్మాత కిరణ్‌తో డబ్బు విషయంలో గొడవ పెట్టుకుందట. దీనికోసం ఒకరి పై మరొకరు పరువు నష్టం కేసులు కూడా పెట్టుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus