క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించి.. ఎమోషనల్ అయిన ‘దంగల్’ నటి ఫాతిమా..!

బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్తా నెలకొల్పిన మీటూ ఉద్యమం ఇండియా మొత్తం పెద్ద ఎత్తున రచ్చ చేసింది. సౌత్లో కూడా బడా నిర్మాతలు, దర్శకులు.. పాపులర్ సింగర్స్ మరియు లిరిసిస్ట్ ల పై ‘మీటూ’ ఆరోపణలు వేశారు కొందరు నటీమణులు. ఇప్పటికీ ఈ ఇష్యు గురించి కొన్ని ఇంటర్వ్యూలలో హీరోయిన్లను ఫార్మాలిటీగా అడుగుతారు. అయితే .. వారు చెప్పే ఆన్సర్స్ జెన్యూన్ గా అనిపించవు. ప్రస్తుతం క్రేజ్ లో ఉన్నవాళ్లు అయితే అలాంటిదేమీ లేదు అంటారు.. ఒకవేళ క్రేజ్ లో లేని వాళ్ళు అయితే ఫేమస్ అవ్వాలని దానినొక అవకాశంగా తీసుకుంటున్న వారు ఉన్నారు.

ఏది నిజమనేది ఎవ్వరూ గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది.సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ‘దంగల్’ లో ఆమీర్ ఖాన్ కూతురుగా కనిపించిన ఫాతిమా సనా మాత్రం.. 3 ఏళ్ళకే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. “చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టినప్పటికీ… హీరోయిన్ అవకాశాలు దక్కించుకోవడానికి చాలా కష్టాలు పడ్డాను. అవకాశాల కోసం ఎక్కడికిళ్ళినా అవమానాలు ఎదురయ్యేవి. కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సులు ఇస్తామని చెప్పేవారు. ‘ఉద్యోగం కోసం క్వాలిఫికేషన్ ఎలానో హీరోయిన్ కావాలంటే కమిట్మెంట్ అలా’ అని చాలా మంది అసభ్యకరంగా మాట్లాడేవారు.

ఇక లైంగిక వేధింపులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. మహిళలకి ప్రతీ చోటా ఆ పరిస్థితి ఎదురవుతూనే ఉంది. నాకు మూడేళ్ళ వయసున్నప్పుడే లైంగిక వేదింపులు ఎదురయ్యాయి. నిజానికి ఇలాంటివి మహిళలు చెప్పుకోలేరు. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది.మహిళలు కూడా చదువుకోవడం వల్ల లైంగిక వేదింపుల గురించి అందరికీ ఒక అవగాహన వచ్చింది. అందుకే ఇప్పుడు అంతా ఓపెన్ గా చెబుతున్నారు” అంటూ ఫాతిమా తన ఆవేదన వ్యక్తం చేసింది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus