రజినీ ‘దర్బార్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా.. మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘దర్బార్’. నయన తార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం జనవరి 9 న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కాబోతుంది. అనిరుథ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నివేదా థామస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘దర్బార్’ చిత్రానికి బిజినెస్ బాగానే జరిగినట్టు తెలుస్తుంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘దర్బార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. రజినీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల పోటీల్ని తట్టుకుని ‘దర్బార్’ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి మరి. ఇక రజినీ గత చిత్రాలైన ‘పేట’ చిత్రానికి 13 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే ‘2.ఓ’ చిత్రానికి 71 కోట్లు, ‘కాలా’ చిత్రానికి 33 కోట్లు, ‘కబాలి’ చిత్రానికి 32 కోట్ల వరకూ బిజినెస్ లు జరిగాయి.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus