ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దర్బార్’. రజినీకాంత్ నటించిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ‘దర్బార్’ విడుదలపై హైకోర్టులో ఉన్న పిటిషన్ పై ఉత్తర్వులు జారీ చేసింది. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ఎనిమిది వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సౌత్ ఇండియాతో పాటు రజినీ సినిమాలకు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా మలేషియాలో తమిళులు ఎక్కువగా ఉండడంతో అక్కడ భారీ స్క్రీన్స్ లో సినిమాను విడుదల చేయాలనుకున్నారు.
అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ గతంలో ‘2.0’ సినిమా కోసం మలేషియాకి చెందిన సంస్థ వద్ద కొంత డబ్బుని తీసుకున్నారు. ఆ మొత్తం ఇప్పుడు రూ.23 కోట్లు అయింది. కానీ ఈ బకాయిలు చెల్లించకుండా ‘దర్బార్’ సినిమాని విడుదల చేస్తుండడంతో సదరు సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాత బకాయిలు చెల్లించి.. ఈ సినిమా విడుదలకు 4.90 కోట్లను డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేదంటే మలేషియాలో ‘దర్బార్’ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పింది. దీంతో మలేషియాలో సినిమా రిలీజ్ కి బ్రేక్ లు పడినట్లేనని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!