Das Ka Dhamki Review in Telugu: దాస్ క ధమ్కీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విశ్వక్ సేన్ (Hero)
  • నివేదా పేతురాజ్ (Heroine)
  • రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ (Cast)
  • విశ్వక్ సేన్ (Director)
  • కరాటే రాజు (Producer)
  • లియోన్ జేమ్స్ (Music)
  • దినేష్ కె బాబు (Cinematography)
  • Release Date : మార్చి 22, 2023

మధ్యలో వచ్చిన పాగల్ తో కాస్త తడబడినా.. తర్వాత వచ్చిన “అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా” చిత్రాలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించడమే కాక, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “దాస్ కా ధమ్కీ”. “ధమాకా” చిత్రంతో పోలికలున్నాయని రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసిన్ కొద్దిపాటి రీషూట్స్ తర్వాత.. చాలా కాన్ఫిడెంట్ గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు విశ్వక్ సేన్. మరి విశ్వక్ కాన్ఫిడెన్స్ ఆడియన్స్ ను ఏమేరకు ఇంప్రెస్ చేసిందో చూద్దాం..!!

కథ: కృష్ణ దాస్ (విశ్వక్ సేన్) చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకొని, స్నేహితులతో కలిసి పెరుగుతాడు. ఒక పెద్ద సెవెన్ స్టార్ హోటల్లో వెయిటర్ గా పని చేస్తుంటాడు. ఒక్కసారైనా వెయిటర్ లా కాకుండా కస్టమర్ లా తను పని చేసే హోటల్ లోనే ఎంజాయ్ చేయాలని.. తన స్నేహితులతో కలిసి వేసిన ప్లాన్ వల్ల కృష్ణ దాస్ జీవితం తలకిందులవుతుంది.

కృష్ణ దాస్ ను లైఫ్ ను తలకిందులు చేసింది ఎవరు? ఆ సమస్యల సుడిగుండం నుంచి కృష్ణ ఎలా తప్పించుకున్నాడు? అనేది “దాస్ కా ధమ్కీ” కథాంశం.

నటీనటుల పనితీరు: విశ్వక్ సేన్ ఈ చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేశాడు. నటుడిగా పర్వాలేదనిపించుకున్నాడు కానీ.. పాత్రలకు అవసరమైన వేరియేషన్స్ ను తన హావభావాలతో చూపించలేకపోయాడు. ముఖ్యంగా రెండో పాత్రలో క్రౌర్యం పండించడానికి కాస్త ఇబ్బందిపడ్డాడు. కృష్ణ దాస్ పాత్రలో మాత్రం ప్రేక్షకుల్ని తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

ఆది, మహేష్ పంచ్ లకు థియేటర్లు ఘోల్లుమనడం ఖాయం. ముఖ్యంగా పాపులర్ మీమ్స్ ను ఇమిటేట్ చేస్తూ వీళ్ళిద్దరూ పండించిన కామెడీ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.

నివేత పేతురాజ్ అందం, అభినయంతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ.. ఆమె పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ కు, క్లైమాక్స్ జస్టిఫికేషన్ కి సింక్ లేకపోవడంతో.. క్లారిటీ మిస్ అయ్యింది. రావు రమేష్ తన డైలాగ్ టైమింగ్ తో అలరించాడు.

సాంకేతిక వర్గం పనితీరు: విశ్వక్ సేన్ ఈ చిత్రానికి దర్శకుడు కూడా కావడం గమనించాల్సిన విషయం. టెక్నికల్లీ చాలా చక్కగా మ్యానేజ్ చేశాడు కానీ.. కంటెంట్ పరంగా, ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో తేలిపోయాడు. ముఖ్యంగా సినిమాలోని ట్విస్టుల్లో పెద్దగా పస లేకపోవడం, సెకండాఫ్ లో కథనం నత్తనడకన సాగడంతో.. దర్శకుడిగా మొదటి చిత్రం “ఫలక్ నుమా దాస్” స్థాయి పేరు సంపాదించుకోలేకపోయాడు.

లియోన్ జేమ్స్ సంగీతం & నేపధ్య సంగీతం బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ & ముఖ్యంగా ఎడిటింగ్ సినిమాను బ్రతికించాయి. ఇంటర్ కట్స్ & లైటింగ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.

విశ్లేషణ: రొటీన్ కథ, కథనాలతో సాగే యావరేజ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ “దాస్ కా ధమ్కీ”. విశ్వక్ సేన్ స్క్రీన్ ప్రెజన్స్, ఆది-మహేశ్ ల కాంబినేషన్ కామెడీ, లియోన్ జేమ్స్ సంగీతం కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. బ్రేకీవెన్ బడ్జెట్ కూడా తక్కువే కావడం, పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం, లాంగ్ వీకెండ్ గట్రా అంశాలన్నీ కన్సిడర్ చేసినప్పుడు.. విశ్వక్ సేన్ ధమ్కీ కమర్షియల్ హిట్ కొట్టేయడం ఈజీయే! .

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus