విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ హీరో, హీరోయిన్లుగా ‘పాగల్’ తర్వాత రూపొందిన మూవీ ‘దాస్ క ధమ్కీ’. ‘వన్మయే క్రియేషన్స్’ ‘విశ్వక్ సేన్ సినిమాస్’ బ్యానర్లపై కరాటే రాజు, విశ్వక్ సేన్ లు కలిసి ఈ చిత్రాన్ని రూ.20 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.విశ్వక్ సేన్ కెరీర్లో ఇది భారీ బడ్జెట్ మూవీ అని చెప్పాలి. లియోన్ జేమ్స్, రామ్ మిర్యాల సంగీతంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన లభించింది.
టీజర్, ట్రైలర్ లు బాగానే ఉండటంతో మార్చ్ 22న ఉగాది కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి డీసెంట్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 2.80 cr |
సీడెడ్ | 1.10 cr |
ఆంధ్ర | 3.00 cr |
ఏపీ + తెలంగాణ | 6.90 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.68 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 7.58 cr |
‘దాస్ క ధమ్కీ’ చిత్రానికి రూ.7.58 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.7.9 కోట్ల షేర్ ను రాబట్టాలి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్’ సినిమా తప్ప.. అతని సినిమాలు ఇంత టార్గెట్ ను అయితే రీచ్ అవ్వలేదు. మరి ‘దాస్ క ధమ్కీ’ ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద టార్గెట్ ను రీచ్ అయ్యి బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో చూడాలి.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?