Srikanth Odela: దసరా సినిమా చూసి మైండ్ బ్లాక్ అయింది!

Advertisement

దసరా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది నాని కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా మార్చి 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకొని 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇలా ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు పరిచయమయ్యారు.మొదటి సినిమాతోనే అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి శ్రీకాంత్ పేరు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మారుమోగిపోతుంది. ఇక ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరటంతో చిత్ర బృందం కరీంనగర్ లో దసరా బ్లాక్ బస్టర్ దావత్ పేరిట సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.ఈ క్రమంలోనే శ్రీకాంత్ తండ్రి చంద్రశేఖర్ వేదికపై దసరా సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. దసరా సినిమా చూశానని ఈ సినిమా చూస్తే నా మైండ్ మొత్తం బ్లాక్ అయిందని ఈయన తెలియచేశారు. ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అవడం వెనుక తన కుమారుడి 12 సంవత్సరాల కష్టం ఉందని చంద్రశేఖర్ వెల్లడించారు.

ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అందుకున్నందుకు ఈయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తన కొడుకు గురించి ఏం మాట్లాడాలో తనకు అర్థం కాలేదని తెలిపారు. తన కుమారుడు ఈ విధంగా సినిమా తీస్తాడని తాను అసలు ఊహించుకోలేదని, అయితే సినిమా అంటే ఏంటి అనేది తెలంగాణ ప్రజలందరికీ చూపించాడని ఎంతో గర్వపడుతున్నానని తెలిపారు.

ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది తనకు ఫోన్లు చేసి శ్రీకాంత్ (Srikanth Odela) ఫస్ట్ సినిమా చేసిన విధంగా లేదు ఐదారు సినిమాలు చేసిన అనుభవంతో ఈ సినిమా చేసినట్టు ఉంది అంటూ తనకు ఫోన్లు చేసి తన పనితనం గురించి మెచ్చుకున్నారంటూ ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అయ్యారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus