Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఏంటయ్యా ఇది..! ఆడియన్స్ ఫైర్..!

బిగ్ బాస్ దసరా స్పెషల్ ఈవెండ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సెలబ్రిటీల డ్యాన్స్ లతో, ఫేమస్ సింగర్స్ పాటలతో, సినిమా స్టార్స్ తో, కమెడియన్స్ చమక్కులతో మెరిసిపోవాల్సిన స్టేజ్ వెల వెలబోయింది. ఆహా లో ఇండియన్ ఐడియల్ సింగర్స్, ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ డ్యాన్స్ లు, అవే సేమ్ రొటీన్ టాస్క్ లు, హౌస్ మేట్స్ పిచ్చి డ్యాన్స్ లతో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నిజానికి ఎప్పుడు దసరా ఈవెంట్ అంటే ఒక రేంజ్ లో ఉండేది. బిగ్ బాస్ సీజన్ – 3 లో హోస్ట్ గా వచ్చిన రమ్యకృష్ణ దుమ్మురేపింది.

హైఎస్ట్ టీఆర్పీలతో దద్దరిల్లిపోయింది. అలాగే సీజన్ 4 లో సమంత హోస్టింగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సీజన్ – 5లో కూడా నాగార్జున హోస్టింగ్, ఎంతోమంది సినిమా స్టార్స్ రావడం, సెలబ్రీటల రావడంతో స్టేజ్ కి ఒక కళ వచ్చింది. ఆ తర్వాత సీజన్ 6లో కూడా దసరా ఈవెంట్ పర్వాలేదనే అనిపించింది. ఈసారి మాత్రం ఎలాంటి మెరుపులు లేవు, ఎటువంటి గెస్ట్ లు కూడా లేరు. కనీసం, సుమ – హైపర్ ఆది కూడా రాలేదు. దీంతో దసరా ఈవెంట్ వెల వెల బోయింది.

ఈ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ ని సేవ్ చేస్తూ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ టీవీలో కనిపించారు. అలాగే వాళ్లు పంపిన లెటర్స్ కూడా హౌస్ మేట్స్ చదువుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రిన్స్ యావర్ , శోభా అయితే వెక్కి వెక్కి మరీ ఏడ్చాడు. హోస్ట్ నాగార్జున వాళ్ల కన్నీళ్లు తుడవడమే సరిపోయింది. ఆ తర్వాత వాళ్లతో ఎంటర్ టైన్మెంట్ గేమ్స్ ఆడించారు కానీ, అది పెద్దగా పండలేదు. ఏదో మొక్కుబడిగా ఆడినట్లుగా అయ్యింది. అంతేకాదు, ఇంతోటి గేమ్స్ లో ప్రిన్స్ యావార్ కి ఈ గేమ్ లో దెబ్బకూడా తగిలింది.

స్టార్ మహిళా ప్రోగ్రామ్ లో ఆడించే ఆటలే కొద్దిగా మార్చి ఆడించారు అని అనిపించింది. ఇక స్టేజ్ పైన ఆడియన్స్ కూడా చాలా బోర్ గా ఫీల్ అయ్యారు. కనీసం వారితో అయినా ఇంట్రాక్షన్ ఉంటే గేమ్ ఎలా ఆడుతున్నారో అనేది వాళ్లకి తెలిసేది. అది కూడా చేయలేదు. కేవలం రతిక రీ ఎంట్రీనే హైప్ చేస్తూ వచ్చారు. పైనల్ గా లాస్ట్ లో రతికని హౌస్ లోకి పంపించారు. బిగ్ బాస్ దసరా ఈవెంట్ (Bigg Boss 7 Telugu) స్పెషల్ ఎపిసోడ్ పై ఇప్పుడు ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. ట్రోల్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.

అన్ని సీజన్స్ కంటే కూడా ఈ దసరా ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, హైపర్ ఆది, సుమ ఇద్దరూ వస్తారని ఊహించామని వాళ్లు రాకపోవడంతో ఈసారి ప్రోగ్రామ్ కి బడ్జెట్ లేదా అంటూ పైర్ అవుతున్నారు. ఇక మరోవైపు దీనిపైన తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీపావళి స్పెషల్ ఎపిసోడ్స్ లో అయినా సరే హైపర్ ఆది, సుమలని తీస్కుని వస్తారా.. ? అది కూడా ఇలాగే కానిచ్చేస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus