సుమారుగా 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకరత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నారు. అందరితో పాటే నేను అని కాకుండా తనకంటూ.. ప్రత్యేకమైన శైలితో ఉన్నత శిఖరాలను అధిరోహించిన దాసరి నారాయణరావు అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో గౌరవం, అభిమానం. అయితే రీసెంట్ గా ఓ ఆడియో ఫంక్షన్ లో దాసరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టీజర్లూ, ట్రైలర్లూ అంటూ అన్నీ ముందే చూపించేసి, ఆ సినిమాపై ప్రేక్షకుడికి ఉన్న ఆసక్తిని తగ్గించేస్తున్నారు. అందుకే కొన్ని సినిమాలు ఆడడం లేదని అన్నారు.
పెద్ద హీరోల సినిమాలకు ప్రమోషన్స్ ఎందుకు..? మీ హీరోకు ప్రేక్షకులను థియేటర్ కు రప్పించే సత్తా లేదా..? అని ప్రశ్నించారు. చిన్న సినిమాలకు మాత్రమే ప్రమోషన్స్ అవసరమని చెప్పారు. అయితే ఈయన మాటలు విన్న కొందరు ప్రమోషన్స్ లేకపోతే ఎలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. సినిమా ప్రమోషన్లు చేసుకోకపోతే ఆ సినిమా జనంలోకి వెళ్లదు అని స్టార్లు సైతం నమ్ముతున్న తరుణమిది. అందుకే పెద్ద పెద్ద సినిమాలకు భారీ ప్రమోషన్లు చేస్తున్నారు.
ఎప్పుడూ మీడియా ముందుకు రాని బడా హీరోలు సైతం కావల్సినవాళ్లకు కావల్సినంత అన్న రేంజులో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నిజానికి గతంలో దాసరి నారాయణరావు ఓ సారి బడా హీరోలు, హీరోయిన్లు ప్రమోషన్లకు రావడం లేదని.. సినిమాకి తగిన పబ్లిసిటీ చేసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఇలా మాట ఎందుకు మారుస్తున్నారో అర్ధం కావట్లేదు.