దాసరి అరుణ్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

దివంగత దర్శకుడు.. ఇండస్ట్రీ పెద్ద అయిన దాస‌రి నారాయణ రావు గారి ఇంట్లో ఆస్తుల విషయంలో గొడవలు చోటుచేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. గత 2,3 రోజులుగా ఈ గొడవలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ఇష్యూ.. పోలీసు స్టేష‌న్ వరకూ వెళ్ళింది. ‘మా త‌మ్ముడు నా ఇంట్లోకి దౌర్జ‌న్యంగా ప్రవేశించి… నన్ను బూతులు తిట్టాడు, ఇంటి బీరువా తెర‌వ‌డానికి కూడా ప్ర‌య‌త్నించాడు’ అని ఆరోపిస్తూ దాసరి నారాయణ రావు గారి పెద్ద కుమారుడు దాస‌రి ప్ర‌భు..

తన తమ్ముడు అలాగే నటుడు అయిన దాస‌రి అరుణ్ కుమార్‌ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ప్రభు కంప్లైంట్ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అరుణ్ కుమార్ ‌పై కేసు న‌మోదు చేసి.. ద‌ర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇక ఈ విషయం పై తాజాగా దాసరి నారాయణ రావు గారి చిన్న కుమారుడైన అరుణ్ కుమార్ స్పందించాడు.ఆయన మాట్లాడుతూ.. “నేను గోడ దూకాను అంటున్నారు. నా ఇంటి గోడ నేను దూకితే త‌ప్పేంటి. నా తండ్రి రాసిన వీలునామా ప్ర‌కారం ఆ ఇంటిలో నాకు కూడా వాటా ఉంది.

మా నాన్న గారు రాసిన వీలునామాని మా అన్నయ్య చూపించాలి. ఆయన అంటున్నట్టుగా … నేనేమీ నా తండ్రి ఆస్తులను ఎవ్వరికీ అమ్మ‌లేదు. మావి చిన్న గొడ‌వ‌లేనండీ…! కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది… అన్నీ సెట్ అయిపోతాయి. కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ విష‌యంలో సినీ పెద్ద‌లు జోక్యం చేసుకుని ప‌రిష్కారం చూపిస్తాను అని ముందుకు వచ్చినా నాకు ఏమాత్రం అభ్యంత‌రం ఏమీ లేదు” అంటూ దాసరి అరుణ్ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus