టాలీవుడ్‌లో గ్లామర్‌తో పాటు బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తోనూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ డింపుల్ హయాతి. మాస్ మహారాజ రవితేజ సరసన హీరోయిన్ గా నటించిన ‘ఖిలాడీ’ , అలాగే గోపీచంద్ సరసన వచ్చిన ‘రామబాణం’ సినిమాలతో ఆమెకు మంచి అటెన్షన్ లభించింది. తెలుగు మాత్రమే కాదు, తమిళ్, కన్నడ భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను బిల్డ్ చేసుకుంటోంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం డింపుల్, హీరో రవితేజతో కలిసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ తన కెరీర్‌కు కీలకమైన టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆమె గట్టిగా నమ్ముతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డింపుల్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆమెను వార్తల్లో నిలిపాయి. అవేంటంటే..
తాను లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణ రావు గారి మనవరాలినని, అలాగే తన నానమ్మ ప్రభ ఒకప్పుడు ప్రముఖ నటిగా ఎన్నో చిత్రాల్లో నటించిందని డింపుల్ వెల్లడించింది. ప్రభ, ఎన్టీఆర్‌తో కలిసి దానవీరశూర కర్ణ వంటి ప్రతిష్టాత్మక సినిమాలోనూ కనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, ఇండస్ట్రీలోకి రావడం అంత ఈజీ కాదని, మారిన పరిస్థితుల వల్ల చాలా ఆలోచించి ఈ రంగాన్ని ఎంచుకున్నానని డింపుల్ పేర్కొంది.
డింపుల్ అసలు పేరు డింపుల్‌నే అయినా, న్యూమరాలజీ కారణాలతో ‘హయతి’ని జోడించుకుంది. తొలి దశలో చిన్న పాత్రలు చేసినా, సక్సెస్ కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డింపుల్ హయతి, ఈసారి మాత్రం గట్టిగా నిలదొక్కుకుంటుందా లేదా అన్నది చూడాలి.