‘చిరు-మోహన్ బాబు’ పై దాసరి శెటైర్స్!!!

  • September 19, 2016 / 06:22 AM IST

ఈ మధ్య టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది…25ఏళ్లు పూర్తి చేసుకున్నాం అని ఒకరు…30ఏళ్లు పూరీ చేసుకున్నాం అని మరొకరు…40ఏళ్ల సినీ ప్రస్తానం అని ఇంకొకరు. ఇంకా 60, 70ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న నటులు కూడా ఉన్నారు. అయితే అలాంటి వేడుకల్లో భాగంగానే తాజాగా మన మంచు మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ఫుల్ గా 40ఏళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఆ వేడుకలను అంగరంగా వైభవంగా జరుపుకున్నారు…ఈ కార్యక్రమానికి ఎందరో తారలు…హాజరయ్యి సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదిలా ఉంటే…ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిధిగా హాజరయిన దర్శకరత్న దాసరి నారాయణ రావు మోహన్ బాబు, చిరులపై శెటైర్స్ వెయ్యడంతో అక్కడి వారంతా నవ్వుల్లో మునిగిపోయారు…ఇంతకీ దాసరి ఏమన్నారు అంటే..చిరంజీవి మోహన్ బాబులు బయటకు తిట్టుకుంటున్నట్లు ఉంటారు కాని వారి లోపల ఉన్న ప్రాణ స్నేహితుల గురించి తనకన్నా మరెవ్వరికీ తెలియదు అని దాసరి కామెంట్ చేశారు…అయితే వారి మధ్య స్నేహాన్ని దాసరి పోగుడుతున్నారో, లేక శెటైర్స్ వేస్తున్నారో అర్ధం కాక చాలా మంది ఆలోచనలో పడ్డారు…ఇక మోహన్ బాబు గురించి మాట్లాడుతూ…ఫంక్షన్లకు రాని వెంకటేష్ బొంబాయ్ నుండి వచ్చిన శ్రీదేవి భర్తకు బాగా లేకపోయినా వచ్చిన జయసుధ అలాగే యంగ్ స్టార్స్ వీరందరూ ఇవాళ వచ్చారంటే దీనికి కారణం మోహన్ బాబు గుండె పిలుపు అని మోహన్ బాబుపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా ప్రతీ క్షణం ఆహ్లాదభరితంగా మోహన్ బాబు 40ఏళ్ల వేడుక జరిగింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus