Tollywood: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాల కొత్త తకరారు!

సినిమా మొత్తం రెడీ చేసుకొని… విడుదల చేయకుండా ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? గత రెండేళ్లుగా టాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితే చాలామందికి కనిపిస్తోంది. ఒకప్పుడు చిన్న హీరోలు, చిన్న సినిమాలకు ఇలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు స్టార్‌ హీరోలకు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. కారణాల్లో ఒకటి కరోనా – లాక్‌డౌన్‌ అయితే. రెండోది ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్లు. ఇప్పుడు ఈ తకరారుతోనే తలలు పట్టుకుంటున్నారు పెద్ద నిర్మాతలు.

టాలీవుడ్‌లో రిలీజ్‌కి రెడీగా ఉన్న, త్వరలో సిద్ధమవుతున్న అగ్ర హీరోలు, కుర్ర అగ్ర హీరోల సినిమాల లిస్ట్‌ చూస్తే పెద్దదిగానే కనిపిస్తోంది. చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేశ్‌ ‘దృశ్యం 2’, ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’, మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’,పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’, అల్లు అర్జున్‌ ‘పుష్ప’, ఎన్టీఆర్‌ – తారక్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’… ఇలా చాలా సినిమాలున్నాయి. ఇవి ప్రేక్షకుల ముందుకు రావాలంటే డేట్లు, రేట్లు తేలాలి.

‘ఆచార్య’ సినిమా అంతా సిద్ధంగా ఉంది. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు రిలీజ్‌ చేసేయొచ్చు. అయితే ఏపీలో టికెట్‌ రేట్లు ఎప్పటివో పురాతనమైనవి ఉన్నాయి. వాటిని అనుసరించి విడుదల చేస్తే… వసూళ్లు ఎలా ఉంటాయో ‘లవ్‌స్టోరీ’కి చూశారు. ఫస్ట్‌ వీకెండ్‌లోనే సుమారు రెండున్నర కోట్లు నష్టం వచ్చిందని అంచనా. అలాంటిది చిరంజీవి సినిమా వస్తే కష్టమే. దీంతో టికెట్‌ రేట్లు సెట్‌ అయ్యాకే చేద్దాం అనుకుంటున్నారట. దీంతో నవంబరు – డిసెంబరులో చేయొచ్చు.

అయితే నవంబరులో టాలీవుడ్‌ సినిమాలు విడుదల పెద్దగా ఉండదు. ఆఫ్‌ సీజన్‌ అని అంటుంటారు. దీంతో డిసెంబరులో వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే డిసెంబరు తేదీలు ఫిక్స్‌ అయిపోయాయి. సంక్రాంతి తేదీలు ఇప్పటికే ఫిక్స్‌ చేసేసినా… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (జనవరి 7) వచ్చి ఆ తేదీలను కదిపేసింది. దీంతో టాలీవుడ్‌లో రేట్లు, డేట్లు ఇబ్బంది కొనసాగుతోంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus