భారీ నష్టాలు తప్పేలా లేవు కామ్రేడ్

  • August 2, 2019 / 06:22 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం మొదటి రోజే ప్లాప్ టాక్ ను మూట కట్టుకున్న సంగతి తెలిసిందే. భరత్ కమ్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘బిగ్ బెన్ సినిమాస్’ బ్యానర్లు కలిసి నిర్మించాయి. జూలై 26 న తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదలయ్యింది ఈ చిత్రం. వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ఈ చిత్రం… వీక్ డేస్ లో మాత్రం ఘోరంగా పడిపోయింది. 15 నిముషాలు ట్రిమ్ చేసినా, సక్సెస్ టూర్లు అనౌన్సు చేస్తున్నా.. కనీసం కలెక్షన్లను కూడా రాబట్టలేకపోతుంది ‘డియర్ కామ్రేడ్’ చిత్రం.

ఇక ‘డియర్ కామ్రేడ్’ నాలుగు రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 6.52 కోట్లు
సీడెడ్ – 1.15 కోట్లు
వైజాగ్ – 1.60 కోట్లు


ఈస్ట్ – 1.20 కోట్లు
కృష్ణా – 0.75 కోట్లు
గుంటూరు – 1.01 కోట్లు


వెస్ట్ – 0.88 కోట్లు
నెల్లూరు – 0.50 కోట్లు
———————————————————–
ఏపీ+నైజాం టోటల్ – 13.61 కోట్లు (షేర్)


రెస్ట్ ఆఫ్ ఇండియా – 3.55 కోట్లు
ఓవర్సీస్ – 3.30 కోట్లు
————————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 20.46 కోట్లు (షేర్)
————————————————————–

ఓపెనింగ్స్ విషయంలో పర్వాలేదనిపించుకున్న ‘డియర్ కామ్రేడ్’. వీక్ డేస్ లో మాత్రం ఆ దూకుడు ఏమాత్రం చూపించలేకపోయింది. కనీసం థియేటర్ల రెంట్లు కూడా రాకపోవడంతో నెగటివ్ షేర్స్ వచ్చాయి. అయితే విజయ్ కెరీర్లో ఇవి సెకండ్.. బిగ్గెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్. విజయ్, రష్మిక కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘గీత గోవిందం’ ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి 38.80 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇదిలా ఉండగా.. ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి 34.60 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటికి.. 21 కోట్ల షేర్ వేసుకున్నా.. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 14 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అదైతే సాధ్యం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటికీ ‘ఇస్మార్ట్ శంకర్’ మంచి వసూళ్ళను రాబడుతుంది. ఇక తాజాగా విడుదలైన ‘రాక్షసుడు’ చిత్రానికి కూడా మంచి టాక్ వచ్చింది. ప్రస్తుతం ఆ చిత్రానికి అడ్వాన్సు బుకింగ్స్ పెరిగాయి. సో ‘డియర్ కామ్రేడ్’ కు ఏమాత్రం కలిసొచ్చే అవకాశం లేదనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus