సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ జూలై 26 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసారు. భరత్ కమ్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అప్పుడే కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రానికి యూ.ఎస్ ప్రీమియర్స్ అదిరిపోయాయి. ప్రీమియర్స్ కే ఈ చిత్రం 2.5 లక్షల డాలర్లను వసూల్ చేసి విజయ్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామా’ చిత్రం ఓపెనింగ్స్ కంటే ‘డియర్ కామ్రేడ్’ కు ఎక్కువ ఓపెనింగ్స్ రావడం విశేషం.
2019 లో వచ్చిన మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రానికి 5.16 లక్షల డాలర్లు, బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రానికి 4.83 లక్షల డాలర్లు అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్ ల ‘ఎఫ్2’ చిత్రానికి , 2.59 లక్షల డాలర్లు.. వచ్చాయి. ఇక వాటి తరువాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. నాని సూపర్ హిట్ ‘జెర్సీ’ చిత్రనికంటే కూడా ‘డియర్ కామ్రేడ్’ కు ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. విజయ్.. ‘డియర్ కామ్రేడ్’ కు ముందు ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికే అత్యధిక ప్రీమియర్స్ వచ్చాయి. ఇక ఫస్ట్ వీకెండ్ ‘డియర్ కామ్రేడ్’ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం – 5.66 కోట్లు
సీడెడ్ – 1.05 కోట్లు
గుంటూరు – 1.03 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.56 కోట్లు
వెస్ట్ – 0.83 కోట్లు
ఈస్ట్ – 1.23 కోట్లు
కృష్ణా – 0.73 కోట్లు
నెల్లూరు – 0.48 కోట్లు
తెలంగాణ & ఏపీలో ‘డియర్ కామ్రేడ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల షేర్ : రూ. 12.57 కోట్లు.
రెస్ట్ అఫ్ ఇండియా – 3.25 కోట్లు
ఓవర్సీస్ – 0.80 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ – 18.95 కోట్లు (షేర్)