అరంగేట్రంతోనే అదరగొట్టిన కొత్త కుర్రాడు “అసిఫ్ ఖాన్”

చిన్నప్పటి నుంచి విక్టరీ వెంకటేష్ కి వీరాభిమాని అయినప్పటికీ… మహేష్ బాబు “పోకిరి” చూశాక “హీరో” అయి తీరాలని ఫిక్సయిపోయాడు. ‘మదనపల్లి’లో సెటిల్ అయిన ఈ కడప కుర్రాడు… ఇంజినీరింగ్ చేస్తూనే… సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నం చేసేందుకు వీలుగా ఏరికోరి హైదరాబాద్ ను ఎంపిక చేసుకున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో ఆ కుర్రాడి ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో “ఎం.ఎస్” చేసేందుకు అమెరికా వెళ్లిన ఈ ఔత్సాహికుడు… ఎం.ఎస్ చేస్తూనే వాషింగ్టన్ లోని ఓ ప్రఖ్యాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫిల్మ్ మేకింగ్ లో డిప్లొమా చేసి… అక్కడ జాబ్ చేస్తూనే సినిమా ప్రయత్నాలు కొనసాగించి… తన లక్ష్య సాధనలో భాగంగా తొలి అడుగులు వేశాడు!!

పట్టు వదలని ఆ విక్రమార్కుడి పేరు
“అసిఫ్ ఖాన్”

ఇటీవల విడుదలైన “నేడే విడుదల” చిత్రంతో హీరోగా పరిచయమైన అసిఫ్ ఖాన్… తొలి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించుకున్నాడు. పలువురు దర్శకులు, నిర్మాతలు తన కోసం “ఆరాలు” తీసే స్థాయిలో… డాన్సులు, ఫైట్స్, పర్ఫార్మెన్స్ పరంగా అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్నాడు. “నేడే విడుదల” నిర్మాణంలో వుండగానే “919” అనే చిత్రంలోనూ నటించే అవకాశం సొంతం చేసుకున్న అసిఫ్… సినిమా రంగంలోనే స్థిరపడాలనే వజ్ర సంకల్పంతో హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, తన మూడో చిత్రంకు సంబంధించిన కథా చర్చల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అసిఫ్ రెండో చిత్రం “919”తో శాండీ సాయి అనే ఓ డైనమిక్ ఎన్నారై వనిత దర్శకనిర్మాతగా పరిచయం అవుతుండటం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus