అన్నకు జరిగినట్లుగానే తమ్ముడికి కూడా..!

మెగాస్టార్ పెద్ద మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన అరంగేట్ర సినిమా విషయంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడో తెలిసిందే. డైరెక్టర్ వైవీఎస్ చౌదరి, ధరమ్ తేజ్ హీరోగా ‘రేయ్’ అనే సినిమాను మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమా పూర్తయు, విడుదల కావడానికి నాలుగేళ్లకు పైగా పట్టేసింది. ఈ సినిమా ఎంతసేపటికీ విడుదల కావడం లేదని.. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా రిలాజైన చాన్నాళ్లకు ‘రేయ్’ రిలీజ్ కాలేదు.

ఇప్పుడు తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ కి కూడా తొలి సినిమా గండం వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. వైష్ణవ్ ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాలి. సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ కరోనా కారణంగా రిలీజ్ కి బ్రేక్ పడింది. థియేటర్లు ఈ మధ్య తెరుచుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. అందుకే వంద శాతం ఆక్యుపెన్సీతో నడిచిన రోజే సినిమాను రిలీజ్ చేద్దామని మేకర్లు ఫిక్స్ అయ్యారు.

ఓటీటీ రిలీజ్ కోసం ఈ సినిమాకి ఆఫర్లు వచ్చినా మేకర్లు దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయింది. ఇప్పుడు రూ.30 కోట్లకు అమ్మితేనే కానీ నిర్మాతలు బయటపడలేరు. అందుకే థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోపక్క వైష్ణవ్ హీరోగా దర్శకుడు క్రిష్ ఓ సినిమాను రూపొందించాడు. షూటింగ్ కూడా పూర్తయింది. మరి ఈ సినిమాల్లో ఏది ముందుగా రిలీజ్ అవుతుందో చూడాలి!

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus