Prabhas, Deepika Padukone: ప్రభాస్ హీరోయిన్ కు ట్రెడిషినల్ వెల్కమ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా దేశ వ్యాప్తంగా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో ప్రాజెక్టు K టాప్ లో నిలబడుతుందని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం వైజయంతి మూవీస్ దాదాపు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు సమాచారం. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా కీలకమైన షెడ్యూల్ మొదలుపెట్టగా అందులో పాల్గొనేందుకు దీపికా పదుకొనే హైదరాబాద్ లోకి అడుగుపెట్టింది.

ఇక చాలా రోజుల తర్వాత తెలుగు గడ్డపై అడుగు పెట్టడంతో వైజయంతి మూవీస్ వారు హిందు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. కొన్ని అందమైన గాజులతో పాటు పసుపు కుంకుమ వంటి వాటిని ప్రత్యేకంగా కానుకగా ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిత్ర యూనిట్ సభ్యులు తెలుగు సంప్రదాయాలను ఎంత చక్కగా పాటిస్తున్నారో అని నెటిజన్లు కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

ప్రాజెక్టు K కేవలం ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికె ఆయన ఒక షెడ్యూల్లో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు మొదలు కాబోతున్న షెడ్యూల్ లో దీపికా పదుకొనే తో పాటు ప్రభాస్ కూడా పాల్గొంటున్నారు. ఈ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమాను 2024 లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus