ప్రభాస్ సినిమా కోసం షాక్ ఇస్తున్న దీపికా డిమాండ్స్

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ప్రభాస్ సినిమా కోసం గొంతెమ్మ కోర్కెలు కోరుతుందట. ఆ సినిమాలో నటించడానికి ఏకంగా హిందీ వర్షన్ హక్కులను పారితోషికంగా అడుగుతుందని తెలుస్తుంది. విషయంలోకి వెళితే ప్రభాస్ 21వ చిత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ పాన్ ఇండియా చిత్రంగా ఆ మూవీ 500కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనుంది. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దేశవ్యాప్తంగా పలు భాషలలో ఈ మూవీ విడుదల కానుండగా,ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. 2022 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్. బారి పాన్ ఇండియా మూవీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలనుకుంటున్నారు. పాత్ర రీత్యా దీపికా పదుకొనె అయితే బెస్ట్ ఆప్షన్ అన్నది దర్శకనిర్మాతల ఆలోచనట. మరి ఈ చిత్రంలో నటించాల్సినదిగా దీపికను సంప్రదించగా ఆమె డిమాండ్స్ చూసి నిర్మాతలకు దిమ్మ తిరిగిందట.

ఈ చిత్రంలో నటించడానికి ఒకే అని చెప్పిన దీపికా పదుకొనె రెమ్యూనరేషన్ గా హిందీ చిత్ర హక్కులు అడిగిందట. అలా తనకు హిందీ వర్షన్ చిత్ర విడుదల హక్కులు ఇస్తే మూవీలో నటిస్తానని కండిషన్ పెట్టిందట ఈ భామ. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ రీత్యా హిందీ హక్కులు సైతం భారీగా పలుకుతాయి. మరి అంత మొత్తంలో రెమ్యూనరేషన్ గా ఇవ్వడం అంటే సాధ్యమయ్యే పనేనా.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus