Deepika Padukone: ఎవరైనా మోసం చేస్తే తట్టుకోలేను: దీపికా పదుకోన్

Advertisement

ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘గెహ్రాయియా’ సినిమాలో లీడ్ రోల్ పోషించిన దీపికా పదుకోన్. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యేవరకు పెద్ద దుమారమే రేగింది. టూ పీస్ బికినీలో కనిపించడం, ఇంటిమేట్ సీన్స్ లో నటించడంతో దీపికపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. అయితే ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఆరేళ్లుగా తనతో రిలేషన్ లో ఉన్న వ్యక్తిని మోసం చేసి.. తన కజిన్ కి కాబోయే భర్తతో సంబంధం పెట్టుకునే అమ్మాయిగా దీపికా ఇందులో నటించింది.

Click Here To Watch

దీంతో రీసెంట్ గా ఇంటర్వ్యూలో దీపికాకు తన పాత్రకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. నిజజీవితంలో ఇలాంటి వాటి విషయంలో మీరెలా రియాక్ట్ అవుతారని ప్రశ్నించగా.. ఎమోషనల్ గా సమాధానమిచ్చింది దీపికా. ‘ఎదుటివాళ్ల రిలేషన్షిప్స్ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. చీటింగ్ జరిగితే వాళ్లు క్షమించి యాక్సెప్ట్ చేస్తారా..? చేయరా..? అనేది వాళ్ల ఇష్టం. కానీ నా విషయానికొస్తే నేను మోసాన్ని సహించలేను. చీట్ చేస్తే తట్టుకోలేను. బంధం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.

అది లేకపోతే అసలు రిలేషన్ కి అర్ధమే లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఫిజికల్ ఎట్రాక్షన్ అనేది ఎక్కువకాలం ఉండదని.. ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం, నమ్మకమే రిలేషన్ ను కాపాడుతుందని చెప్పుకొచ్చింది. గతంలో ఓ హీరోతో రిలేషన్ లో ఉన్న దీపికా.. అతడు తనను మోసం చేశాడని ఇదివరకు చెప్పింది. సెకండ్ ఛాన్స్ ఇచ్చినా నిలబెట్టుకోలేకపోయాడని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus