Deepika Padukone: ఆ విషయంలో రెజీనాను ఫాలో అయిన దీపిక.. మ్యాగీ కంటే చీప్ అంటూ?

  • May 19, 2023 / 08:54 PM IST

ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోయిన్లు మగవాళ్లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ మగాళ్లు, మ్యాగీ రెండు నిమిషాలే అని చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా దీపిక సైతం అదే తరహాలో బోల్డ్ కామెంట్లు చేయడం గమనార్హం.

దీపికా పదుకొనే ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రాజెక్ట్ కే సినిమాతో దీపికా పదుకొనే మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో దీపిక మగవాళ్ల స్టామినా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ విషయంలో మగవాళ్లు మ్యాగీ కంటే చీప్ అంటూ దీపికా పదుకొనే బోల్డ్ కామెంట్లతో రెచ్చిపోవడం గమనార్హం.

ఆడవాళ్లతో పోల్చి చూస్తే మగవాళ్ల స్టామినా తక్కువగా ఉంటుందని (Deepika Padukone) దీపిక పేర్కొన్నారు. ఒక ఇంగ్లీష్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక ఈ విషయాలను వెల్లడించారు. మగవాళ్ల గురించి కామెంట్లు చేసి అనవసర వివాదాల్లో దీపిక చిక్కుకోవడం అభిమానులను సైతం ఎంతగానో బాధ పెడుతోంది. దీపిక వివాదంలో చిక్కుకోగా ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ప్రాజెక్ట్ కే సినిమా 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ కాగా సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ అవుతుందో లేక మరో టైటిల్ ను ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది. ప్రభాస్, దీపికా పదుకొనే ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus