Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ‘స్పిరిట్’ ‘కల్కి 2898 AD'(సీక్వెల్) నుండి స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణెను తప్పించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై చాలా రోజుల నుండి ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి . ‘రోజుకు 8 గంటలే పని చేస్తానని ఆమె చెప్పిన కారణంతో’ దీపిక..ని ఆ ప్రాజెక్టుల నుండి తొలగించినట్టు మేకర్స్ తెలుపడం జరిగింది. ఈ విషయంపై దీపికా అభిమానులు, ముఖ్యంగా బాలీవుడ్ జనాలు ‘స్పిరిట్’ ‘కల్కి 2898 AD’ దర్శకులైన సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్..లపై ట్రోలింగ్ చేయడం జరిగింది. బాలీవుడ్ స్టార్స్ సైతం దీపికాకి మద్దతు పలికారు.అయితే దీపికా వెంటనే ఈ విషయంపై స్పందించలేదు.

Deepika Padukone

మొత్తానికి ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్‌ను ప్రశ్నిస్తూ దీపిక మాట్లాడింది. “చాలామంది మేల్ సూపర్ స్టార్లు చాలా ఏళ్లుగా రోజుకు 8 గంటలే పనిచేస్తున్నారు. వాళ్లలో కొందరు సోమవారం నుంచి శుక్రవారం వరకే పనిచేస్తారు. ఇంకొంతమంది మధ్యాహ్నం వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతారు. అది ఎప్పుడూ పెద్ద వార్త కాలేదు. కానీ ఓ మహిళ అయిన నేను అడిగితే మాత్రం ‘పంతానికి పోతోంది’ అని ముద్ర వేస్తారా? అయితే అలాగే కానివ్వండి” అంటూ దీపికా స్పందించింది.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరుకే పరిశ్రమ అని, ఇక్కడ సరైన వ్యవస్థ లేకపోవడం, అసంఘటితంగా ఉండటం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని కూడా దీపికా కుండబద్దలు కొట్టింది. ఇదిలా ఉండగా, ‘స్పిరిట్’ టీం దీపికాని హీరోయిన్ గా తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది లేదు. తీసేసినట్టు కూడా అధికారికంగా చెప్పలేదు. కానీ ‘కల్కి 2898 ad’ టీం అయితే ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాము, దీపిక… పరస్పర అంగీకారంతోనే ఈ ప్రాజెక్టు విషయంలో వేరు అవుతున్నట్టు స్పష్టం చేసింది.

అయితే, ప్రాజెక్ట్‌కు అవసరమైన పూర్తిస్థాయి కమిట్‌మెంట్ విషయంలో సయోధ్య కుదరలేదని కూడా మెన్షన్ చేయడం సంచలనం అయ్యింది.అటు ‘స్పిరిట్’ నుంచి కూడా దీపిక తప్పుకోవడంతో దర్శకుడు సందీప్ వంగా కూడా ఆమెను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్లు చేశారు. మొత్తానికి, దీపిక వ్యాఖ్యలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ కల్చర్, జెండర్ ఈక్వాలిటీపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది.

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus