Deepika Padukone: అంతర్జాతీయ వేదికపై బాలీవుడ్‌ స్టార్‌కి అరుదైన గౌరవం!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పడుకొణెకు అరుదైన గౌరవం దక్కనుంది. సాకర్‌ ప్రపంచకప్‌ను ఆవిష్కరించే అరుదైన అవకాశం ఈ పొడుగు కాళ్ల సుందరికి దక్కింది. ఫైన‌ల్ మ్యాచ్‌కి ముందు దీపికా ప‌డుకొణె ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీని ఆవిష్క‌రించే ఛాన్స్ ద‌క్కింది. ఈ మేర‌కు ఆమె ఖ‌తార్‌కు పయ‌నమవుతోంది. సాక‌ర్‌ ప్రపంచ కప్‌లో భారత్‌కు చాలా ఏళ్లుగా ప్రాతినిధ్యం లేదు. అలాంటిద కప్‌ ఆవిష్కరణకు భారత నటి వెళ్లడం గొప్ప విషయమే కదా.

డిసెంబరు 18 ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఆ రోజే దీపిక ఆ ఈవెంట్‌లో కప్‌ ఆవిష్కరించబోతోంది. ఇంతటి భారీ ఈవెంట్‌ను ఏ హాలీవుడ్‌ స్టార్‌తో చేయిస్తారేమో అని అందరూ అనుకుంటుండగా.. బాలీవుడ్‌ నాయికతో చేయించడం పెద్ద విషయమే అని చెప్పొచ్చు. ఫిఫా ఆంథమ్‌, ఫ్యాన్‌ ఫెస్ట్‌ ఈవెంట్‌లో బాలీవుడ్‌ నటి నోరా ఫతేహీ స్థానం సంపాదించుకుంది. ఫిఫా ఆంథమ్‌ ‘లైట్‌ ఇన్ ది స్కై’లో నోరా డ్యాన్స్‌ అదిరిపోయింది.

ఇప్పటికే వివిధ అంతర్జాతీయ వేదికల మీద దీపిక అలరించింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జ్యూరీలో స‌భ్యురాలిగా కూడా వ్య‌వ‌హ‌రించింది. ‘XXX రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ సినిమాతో హాలీవుడ్‌ హీరోయిన్‌గా మారిన దీపిక.. ఆ తర్వాత అటువైపు వెళ్లలేదు. అయినప్పటికీ ఇంటర్నేషనల్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఆ పాపులారిటీతోనే ఇలాంటి అరుదైన గౌరవాలు దక్కించుకుంటోంది. దీపిక సినిమాల విషయానికొస్తే.. షారుఖ్‌ ఖాన్‌, జాన్‌ అబ్రహమ్‌తో ‘పఠాన్‌’ అనే సినిమా చేస్తోంది.

ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయనున్నారు. దీంతోపాటు తెలుగులో ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’లో కూడా నటిస్తోంది. 2023 ద్వితీయార్ధంలో ఈ సినిమాను విడుదల చేస్తారని సమాచారం. అలాగే రణ్‌వీర్‌ సింగ్‌ ‘సర్కస్‌’ సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేసింది. షారుఖ్‌ ‘జవాన్‌’లో అతిథి పాత్రలో నటించిందని టాక్‌. వీటితోపాటు హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. ఈ సినిమా 2024లో విడుదలవుతుంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus