Deepika Padukone: కాప్‌ యూనివర్స్‌పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

దీపిక పడుకొణె వయ్యారాలు, అందాలు ఎంత బాగుంటాయో.. మగరాయుడిలా ఫైట్స్‌ చేసినా, యక్షన్‌ సీక్వెన్స్‌ చేసినా అంతే బాగుంటుంది. గతంలో కొన్ని సందర్భాల్లో ఈ రెండు కోణాలను చూపించింది దీపిక. తాజాగా మరోసారి అలాంటి అవకాశం వచ్చిందా? రోహిత్‌ శెట్టి మాటలు వింటుంటే.. అవుననే అనిపిస్తోంది. అయితే ఆయన ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. జస్ట్‌ ‘ఈమెనే మా లేడీ సింగమ్‌’ అని చెప్పి వదిలేశారు అంతే. ‘సర్కస్‌’ సినిమా ప్రచారంలో భాగంగా ఈ మాటలు చెప్పుకొచ్చారు రోహిత్‌ శెట్టి.

బాలీవుడ్‌లో సిరీస్‌ తరహా సినిమాల్లో ‘సింగమ్‌’ సిరీస్‌ ఒకటి. ‘సింగమ్‌’, ‘సింగమ్‌ రిటర్న్స్‌’ అంటూ ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. తమిళంలో సూర్య – హరి చేసిన ‘సింగమ్‌’ సినిమాను హిందీలో అజయ్‌ దేవగణ్‌ – రోహిత్‌ శెట్టి అదే పేరుతో తీసుకొచ్చారు. ఆ సినిమా హిట్‌ అవ్వడంతో ‘సింగమ్‌ రిటర్న్స్‌’ అంటూ మరో సినిమా చేశారు. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో చిత్రంగా ‘సింగం అగైన్‌’ను చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్‌ చేస్తారట.

మరోసారి ‘సింగమ్‌’గా అజయ్‌ దేవ్‌గణే నటిస్తాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అంటూ ఓ చర్చ బాలీవుడ్‌లో వినిపిస్తుంది. దీనికి రోహిత్‌ శెట్టి క్లారిటీ ఇచ్చారు. ‘ఈమెనే మా లేడీ ‘సింగమ్‌’’ అంటూ దీపిక పడుకొణెను పరిచయం చేశారు రోహిత్‌ శెట్టి. దీంతో దీపిక ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయిపోతున్నారు. దీపికను ఫుల్‌ స్వింగ్‌ సినిమాలో చూసి ప్రేక్షకులకు చాలా రోజులు అయ్యింది. రోహిత్‌ సినిమా అంటే.. దీపిక విశ్వరూపమే ఉంటుంది. గతంలో చూశాం కూడా. అందుకే ఫ్యాన్స్‌ హ్యాపీ.

అయితే ఈమే మా హీరోయిన్‌ అని చెప్పకుండా.. ‘లేడీ సింగమ్‌’ అని అనడం వెనుక ఇంకో కారణం ఉంది అంటున్నారు. మూడో ‘సింగమ్‌’లో దీపిక అందాలతోపాటు, యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉంటాయి అని రోహిత్‌ సూచన ప్రాయంగా చెప్పారా? అనే డౌట్‌ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌. ‘సర్కస్‌’ సినిమాలో ‘కరెంట్‌ లగా రే..’ అనే పాటలో స్టార్‌ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పడుకొణె డ్యాన్స్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పుడే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ కాంబో మళ్లీ ఎప్పుడు అంటే ‘లేడీ సింగమ్‌’ టాపిక్‌ వచ్చింది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus