Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీకి అంతర్జాతీయ గుర్తింపు!

బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ దీపికా పదుకోన్. ‘రామ్‌లీలా’, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్’ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బ్యూటీ త్వరలోనే ప్రభాస్-నాగశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలో కనిపించనుంది. ఇదిలా ఉండగా.. తాజాగా దీపికా 2021కిగానూ గ్లోబెల్ ఎచీవ‌ర్స్ బాలీవుడ్ ఉత్త‌మ న‌టిగా అవార్డును ద‌క్కించుకున్నారు. ఈ అవార్డుకు అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా, బిజినెస్‌మెన్‌ జెఫ్‌ బెజోస్‌,

క్రీడాకారుడు క్రీస్టీనో రోనాల్డో లాంటి వారితో కలిసి దీపికా పదుకోన్ ఎంపికవ్వడం విశేషం. ఈ అవార్డుల కోసం వివిధ రంగాల‌కు చెందిన‌ 3000 నామినేష‌న్స్ వ‌చ్చాయి. అందులో దీపికా పదుకోన్ ఉత్త‌మ న‌టిగా అవార్డును దక్కించుకుంది.. ఇండియా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఇండియన్‌ దీపికా కావడం విశేషం. గతంలో కూడా ఆమె చాలా అవార్డులను సొంతం చేసుకుంది. 2018లో టైమ్స్ మేగ‌జైన్ ప్ర‌పంచంలో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్న వంద మంది వ్య‌క్తుల్లో దీపికా ప‌దుకొనె ఒక‌ర‌ని అవార్డును ప్ర‌క‌టించింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం దీపికా నటించిన ’83’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే షారుఖ్ తో ‘పఠాన్’, హృతిక్ రోషన్ తో ‘ఫైటర్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అవి షూటింగ్ దశలో ఉన్నాయి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus