Deepthi Sunaina, Shanmukh: నిజంగానే దీప్తి ఇచ్చిన హింట్ ని షణ్ముక్ నోటీస్ చేశాడా..?

బిగ్ బాస్ హౌస్ లో శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున శాక్రిఫైజ్ చేయమని టాస్క్ పెట్టాడు. హౌస్ మేట్స్ ఇష్టమైన వస్తువులని త్యాగం చేస్తే వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తో, లేదా ఫ్రెండ్స్ తో కలుసుకోవచ్చని చెప్పాడు. దీంతో అందరూ తమ వస్తువులని త్యాగం చేసి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారు. ఇక్కడే షణ్ముక్ దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్ ని త్యాగం చేశాడు. దీంతో షణ్ముక్ ని పలకరించేందుకు తన బ్రదర్ సంపత్ వచ్చాడు. ఆ తర్వాత షణ్ముక్ దీప్తి కోసం వెయిట్ చేస్తున్నాడని తెలిసి దీప్తిసునయనని స్టేజ్ పైకి తీస్కుని వచ్చారు. దీప్తిని చూడగానే ఆనందంతో షణ్ముక్ ముఖం వెలిగిపోయింది.

ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్కుంటూ మరీ దీప్తితో మాట్లాడాడు. ఇక్కడే దీప్తి నువ్వు వీక్ అవ్వద్దని, నీ ఎమోషన్స్ ని నీ బలంగా మార్చుకోమని సలహా ఇచ్చింది. నువ్వేంటో నాకు బాగా తెలుసు అంటూ ఐలవ్ యూ చెప్తూనే ఫ్లైయింగ్ కిస్ ఇచ్చుకున్నారు. అయితే, ఇక్కడే దీప్తి మాట్లాడుతూ సచ్చినోడా అంటూ వేళ్లతో ముందు సైగలు చేసింది. ఆ తర్వాత రెండు వేళ్లతో మైక్ ని పట్టుకుంటూ నీ పొజీషన్ టూ అంటూ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. ఇక షణ్ముక్ కూడా చూసి చూడనట్లుగా అటువైపు చూశాడు. ముందుకు ఫింగర్స్ ని కొడుతూ హింట్ లాగా ఇచ్చింది.

ఆ తర్వాత రెండు వేళ్లని క్లియర్ గా చూపిస్తూ మైక్ ని హోల్డ్ చేసింది. ఇది చూసిన బిగ్ బాస్ వ్యూవర్స్ దీప్తి లీక్ చేసింది చూడండి అంటూ ఫోటోలని వైరల్ చేస్తున్నారు. ఆ తర్వాత దీప్తి, సంపత్ ఇద్దరూ కలిసి టాప్ 5 పెట్టారు. దీంతో షణ్ముఖ్‌, శ్రీరామ్‌, సన్నీ, రవి, మానస్‌లు వరుసగా టాప్‌ 5లో ఉంటారని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, గ్రాండ్ ఫినాలే లో కలుద్దాం అంటూ దీప్తి హింట్ కూడా ఇచ్చింది. ఇక్కడే నువ్వు బయటకి రావడం అనేది నాకు నచ్చదు అని చెప్తే, నువ్వు ఉన్నావ్ కదా చూసుకోవడానికి నేను ఇప్పుడప్పుడే రానులే అంటూ షణ్ముక్ చెప్పడం గమనార్హం. అదీ మేటర్.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus