Pawan Kalyan: వారాహి గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన వచ్చే ఎన్నికలకోసం ఎంతో కృషి చేస్తున్నారు.ఇప్పటికే ఎన్నో ప్రాంతాలలో పర్యటిస్తూ అధికార పక్షాలను ప్రశ్నిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం వారాహి అనే వెహికల్ ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వారాహి వచ్చినప్పటి నుంచి అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల వివాదం నెలకొంది.

వారాహి కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉండడంతో ఇది ఆర్మీ వెహికల్స్ కి మాత్రమే ఉంటుందని పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత వాహనానికి ఎలా ఉపయోగించుకున్నారంటూ పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. అయితే తాజాగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వారాహి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కమిషనర్ పాపారావు మాట్లాడుతూ ఈ వెహికల్ వారం ముందే రిజిస్ట్రేషన్ అయిందని తెలిపారు.

ఇక ఈ వెహికల్ ఆలివ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ కి మధ్య తేడా పెద్దగా కనిపించదని.. వెహికల్ బాడీ బిల్డర్ ఇచ్చిన సర్టిఫికెట్ ను పరిశీలించిన అనంతరం పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు. ఇక వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ గురించి కూడా పలు వార్తలు వస్తున్నాయి. వారాహి TS 13 EX 8384 పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే.. ఈ నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ప్రభుత్వానికి డబ్బు చెల్లించి ఈ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు.

సాధారణంగా ఇలాంటి నెంబర్స్ చాలా తొందరగా ఎవరికి అలర్ట్ కావు అయితే ఇలాంటి నెంబర్స్ కావాలి అంటే ప్రభుత్వానికి 5000 రూపాయలు చెల్లించి ఇలాంటి నెంబర్స్ తీసుకోవచ్చని పాపారావు వెల్లడించారు.ఈ క్రమంలోనే వారాహి కోసం 5000 రూపాయలు ఖర్చు చేసి ఈ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఈయన వెల్లడించారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus